వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపు ఓటింగ్ ఎవ‌రికి: ప‌వ‌న్ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌..మ‌ధ్యలో జ‌గ‌న్

|
Google Oneindia TeluguNews

Recommended Video

కాపు ఓట్ల కోసం ముద్రగడతో టీడీపీ మంతనాలు..?

కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం టీడీపీలోకి ఎంట్రీ ఇస్తున్నారా..? టీడీపీ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు వ చ్చాయి..? ముద్ర‌గ‌డ టీడీపీలో చేరితే కాపుల్లో టీడీపీ పై సానుకూల‌త పెరుగుతుందా..? ప‌వ‌న్ క‌ళ్యాన్ ద్వారా కాపు ఓటింగ్ లో జ‌రిగే న‌ష్టాన్ని టీడీపీ ముద్ర‌గ‌డ ద్వారా భ‌ర్తీ చేసుకోగ‌ల‌దా...? అస‌లు ముద్ర‌గ‌డ కోసం టీడీపీ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఏంటి....? దీని వెనుక ఉన్న ఎత్తుగ‌డ‌లు ఏంటి...? ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ సైతం ముద్ర‌గ‌డ కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.

కేంద్రం కోర్టులోకి బంతిని నెట్టేసిన టీడీపీ

కేంద్రం కోర్టులోకి బంతిని నెట్టేసిన టీడీపీ

కాపు రిజ‌ర్వేష‌న్ల పై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల ప్ర‌భావం తో ఇదే అంశం చుట్టూ ఏపీ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. కాపు ఓటు బ్యాంకు కాపాడుకొనేందుకు అన్ని పార్టీలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. కాపు రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేస్తామంటూ 2014 ఎన్ని క‌ల హామీ ఇచ్చిన టీడీపీ గ‌త ఏడాది దీనికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టేసింది. అయితే, ఆ స‌మ‌యంలో మంజునాధ క‌మిటీ ఛైర్మ‌న్ క‌మిటీ నివేదిక పై సంత‌కం చేయ‌లేదు. కానీ, క‌మిటీలోని మెజార్టీ స భ్యులు ఇచ్చిన అభిప్రాయ‌మే క‌మిటీ రిపోర్ట్ గా ప‌రిగ‌ణించి..తీర్మానం చేసామ‌ని ఏపీ ప్ర‌భుత్వం చెబుతోంది. ఇక‌, కేంద్రం దీని పై నిర్ణ‌యం తీసుకోవాల‌ని..తాము చేయ‌గ‌లిగింది చేసామ‌నేది టీడీపీ వాద‌న‌.

కాపు ఓట్లను పవన్ కొల్లగొడుతాడనే భావనలో టీడీపీ వైసీపీ

కాపు ఓట్లను పవన్ కొల్లగొడుతాడనే భావనలో టీడీపీ వైసీపీ

ఇదే స‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ తాను కాపు రిజ‌ర్వేష‌న్ల పై హామీ ఇవ్వ‌లేన‌ని చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టించాయి. అయితే, త‌న వ్యాఖ్య‌లు వ‌క్రీక‌రించా ర‌ని..తాను కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని జ‌గ‌న్ తాజాగా వివ‌ర‌ణ ఇచ్చారు. ఇక‌, కాపు ఓటు బ్యాంకు ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కొల్ల‌గొడుతార‌ని..అది త‌మ‌కు న‌ష్టం చేస్తుంద‌నే భావ‌న అటు టీడీపీలో..ఇటు వైసీపీ లో ఉంది. దీంతో..బీసీ వ‌ర్గాల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు. దీనిని గ్ర‌హించిన టీడీపీ బీసీలు త‌మ వైపే ఉన్నార‌ని చెబుతూ..తిరిగి కాపుల్లో ప‌ట్టు కోల్పోకుండా రాజ‌కీయంగా ఎత్తుగ‌డ‌లు ప్రారంభించింది. అందుకోసం కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం ఉద్య‌మించిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ను త‌మ వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.

కాపు ఓట్ల కోసం ముద్రగడతో టీడీపీ మంతనాలు..?

కాపు ఓట్ల కోసం ముద్రగడతో టీడీపీ మంతనాలు..?

గ‌త ఎన్నిక‌ల్లో పవన్ కళ్యాణ్ కార‌ణంగా కాపు ఓటింగ్ టీడీపీకి అనుకూలంగా జ‌రిగింద‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం. ఈ సారి ప‌వ‌న్ టీడీపీకి వ్య‌తిరేకంగా ఉండ‌టం..కాపు రిజ‌ర్వేష‌న్ల అమ‌లు సంద‌ర్బంలో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు పై విమ‌ర్శ‌లు ఉండ‌టంతో..ఎలాగైనా ముద్ర‌గ‌డ ద్వారా త‌మ‌కు కాపుల్లో మ‌ద్ద‌తు పెరిగేలా వ్యూహాన్ని టీడీపీ సిద్దం చేస్తోంది. దీని కోసం ముద్ర‌గ‌డ‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే ఒక సీనియ‌ర్ మంత్రితో పాటుగా..ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హారిస్తున్న కీల‌క అధికారి ముద్ర‌గ‌డ తో మంత‌నాలు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. జ‌గ‌న్ కాపు రిజ‌ర్వేష‌న్ల పై చేసిన వ్యాఖ్య‌లను వ్య‌తి రేకించిన ముద్ర‌గ‌డ‌..ప‌రోక్షంగా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా చేసిన వ్యాఖ్య‌లు సైతం ఇదే కోవ‌లో క‌నిపిస్తున్నా యి.

ఎంత పిండికి అంత రొట్టె అన్న భావనలో జగన్

ఎంత పిండికి అంత రొట్టె అన్న భావనలో జగన్

ముద్ర‌గ‌డ టీడీపీకి ప్ర‌త్య‌క్షంగా లేదా ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ఇస్తే..అది ప‌వ‌న్‌- జ‌గ‌న్ కు ఎంత మేర న‌ష్టం చేస్తుంద‌నే దాని పై పార్టీలు లెక్క‌లు వేసుకుంటున్నాయి. అయితే, కాపు రిజ‌ర్వేష‌న్ల వ్య‌వ‌హారం పూర్తిగా కొలిక్కిరాకుండా టీడీపీ తో ముద్ర‌గ‌డ చేతులు క‌లిపితే అది టీడీపీకి..ముద్ర‌గ‌డ కు ఇద్ద‌రికీ న‌ష్ట‌మే అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక‌, సామాజిక వ‌ర్గాలు..రిజ‌ర్వేష‌న్ల అంశం పై జ‌న‌సేన పార్టీ స‌మావేశం నిర్వ‌హిస్తోంది. ఇక‌, జ‌గ‌న్ మాత్రం కాపుల్లో త‌మ‌కు ఎంత మేర బ‌లం ఉంటే అంత‌మేర ఓట్లు వ‌స్తాయ‌ని..దీని కోసం తాను అలివి కాని హామీలు ఇవ్వ‌లేన‌ని చెబుతున్నారు. తాను ప్రతీ విష‌యంలో పార‌ద‌ర్శ‌కంగా ఉంటేనే..తాను ఇచ్చే హామీల‌ను ప్ర‌జ‌లు న‌మ్ముతార‌ని..తన విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ తీసుకొనే ప‌ని చేయ‌న‌ని పార్టీ నేత‌ల‌తో చెబుతున్నారు. దీంతో..ఇటువంటి ప‌రిస్థితుల్లో కాపుల‌ను మచ్చిక చేసుకొనేందుకు పార్టీలు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.

English summary
News is making rounds in amaravati, that the Kapu community leader Mr. Mudragada is having all plans to join TDP very time soon. But the question that is haunting here is whether Mudragada has the capability of pulling the community votes for TDP when Janasena chief Pawan Kalyan himself comes from a kapu community.Now the war in AP has turned between Mudragada Pawan Kalyan and Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X