జగన్ పార్టీ చిక్కు: గొట్టిపాటి ఆవిష్కరించిన ఫలకం ధ్వంసం, కరణం వర్గీయులేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకిలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్, మరో నేత కరణం బలరాంల మధ్య ఆధిపత్య పోరు ఉంది.

అక్రమాస్తి కోసమే మా పార్టీలోకి, ఇప్పుడొచ్చి పెత్తనమా: గొట్టిపాటిపై కరణం

గొట్టిపాటి రవి కుమార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో టిడిపిలో అప్పటికే సీనియర్ అయిన కరణంకు గొట్టిపాటికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.

gottipati ravi kumar

ఇప్పటికే జమ్మలమడుగు, నంద్యాల వంటి పలు చోట్ల టిడిపి నేతలకు, వైసిపి నుంచి వచ్చి సైకిల్ ఎక్కిన నేతలకు పొసగడం లేదు. అద్దంకిలోను అదే పరిస్థితి కనిపిస్తోంది.

అద్దంకి మండలం కొంగపాడులో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ఆవిష్కరించిన శిలా పలకాన్ని కొంతమంది ధ్వంసం చేశారు. ఇది కరణం బలరాం వర్గం పనే అని గొట్టిపాటి వర్గీయులు ఆరోపిస్తున్నారు. మణికేశ్వరంలో గొట్టిపాటి వర్గీయుల ఫ్లెక్సీలను చించేశారు. దీనికి కూడా కరణం వర్గీయులే కారణమని ఆరోపిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Differences between MLA Gottipati Ravi Kumar and TDP senior leader Karanam Balaram in Addanki.
Please Wait while comments are loading...