• search

విజయవాడ అల్లుడు కానున్న కర్ణాటక సీఎం కుమారుడు? ఆ అమ్మాయి ఎవరో తెలుసా?

By Garrapalli Rajashekhar
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
      ఆంధ్రా అమ్మాయితో నిఖిల్ పెళ్లిపై జోరుగా సాగుతున్న ప్రచారం...!

      విజయవాడ: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దంపతులు తమ కుమారుడు, సినీ హీరో నిఖిల్ గౌడ పెళ్లి చూపుల కోసం శుక్రవారం విజయవాడకు వచ్చినట్లు తెలిసింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత బోడెపూడి శివకోటేశ్వరరావు నివాసానికి చేరుకున్నారు.

      కోటేశ్వరరావు ఇంటికి

      కోటేశ్వరరావు ఇంటికి

      కోటేశ్వరరావు కుమార్తెతో నిఖిల్ వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కుమారస్వామి దంపతులు.. శుక్రవారం కోటేశ్వరరావు ఇంటికి వచ్చారు. కాగా, ఈ సందర్భంగా కుమారస్వామి వెంట మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రామకృష్ణంరాజు ఉన్నారు.

      విజయవాడకు అల్లుడు?

      విజయవాడకు అల్లుడు?

      అంతా అనుకున్నట్లు జరిగితే కర్ణాటక సీఎం కొడుకు.. ఏపీకి అల్లుడు కానున్నాడన్నమాట. అయితే, ఈ పెళ్లి చూపుల విషయంపై ఇరు కుటుంబాల వారు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అంతా రహస్యంగానే జరిగింది.

      దుర్గమ్మను దర్శించుకుని..

      దుర్గమ్మను దర్శించుకుని..

      అంతకుముందు కుమారస్వామి దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విజయవాడకు చేరుకున్న సీఎం కుమారస్వామి, ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఆ తర్వాతే కోటేశ్వరరావు ఇంటికి వెళ్లారు కుమారస్వామి దంపతులు.

      రెండేళ్లుగా పరిచయం..

      రెండేళ్లుగా పరిచయం..

      కాగా, నిఖిల్, ఆ అమ్మాయికి గత రెండేళ్ల క్రితం నుంచే పరిచయం ఉందని తెలిసింది. బెంగళూరులోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికి వివాహం చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

      పెళ్లి సంబంధం కోసం కాదంటూ..

      అయితే,కుమారస్వామి దంపతులు పెళ్లి సంబంధం కోసం వచ్చారన్న వార్తల్లో వాస్తవం లేదని ప్రాఫిట్‌ షూమార్ట్‌ అధినేత కోటేశ్వరరావు స్పష్టం చేశారు.కుమారస్వామి తమ ఫ్యామిలీ ఫ్రెండ్‌ అన్నారు. అందుకే ఆ కుటుంబాన్ని భోజనానికి పిలిచామని చెప్పారు. కాగా, ప్రస్తుతం ఆయన కూతురు ప్రాఫిట్ కంపెనీ వ్యవహారాలను చూసుకుంటున్నారు.

      English summary
      Karnataka Chief Minister and film producer HD Kumaraswamy's son actor Nikhil Gowda is all set to tie the knot. Interestingly, the bride is a Telugu girl who hails from Vijayawada. Nikhil's debut film was the Kannada-Telugu bilingual film 'Jaguar' that released two years ago.

      Oneindia బ్రేకింగ్ న్యూస్
      రోజంతా తాజా వార్తలను పొందండి

      X
      We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more