వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్యా.. ఇక చాలయ్యా.. : సెటైర్స్ తో కర్ణాటక జనం వ్యతిరేకత

|
Google Oneindia TeluguNews

వెంకయ్యనాయుడుకి రాజ్యసభ తిప్పలు తప్పేలా లేవు. త్వరలో రాజ్యసభ పదవీకాలం ముగిసిపోతున్నందువల్ల బీజేపీ నుంచే ప్రాతినిథ్యం దక్కుతుందా.. లేక మిత్రపక్షాలేమైనా అవకాశం ఇస్తాయా.. అన్న దానిపై ఇంకా డైలామా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ డైలామా ఇలా కొనసాగుతుండగానే.. కర్ణాటక నుంచే ఆయనకు బీజేపీ మరోసారి అవకాశం ఇస్తుందన్న వార్తలు కర్ణాటక రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి.

కాగా కర్ణాటక నుంచి 1998,2004,2010 సంవత్సరాల్లో మూడు వరుస దఫాల్లో రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నారు వెంకయ్య. ఇక నాలుగో దఫా కూడా కర్ణాటక నుంచే అవకాశం వస్తుందని ప్రచారం జరుగుతుండడంతో అక్కడి జనం బీజేపీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నుంచి కర్ణాటక తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న వారిలో వెంకయ్యనాయుడుతో పాటు అయనూర్ మంజునాథ్ పదవీ కాలం కూడా ముగిసిపోనుంది.

karnataka people satires on venkaiah rajyasabha seat

ప్రస్తుత కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం చూసుకుంటే.. బీజేపీకి ఒక రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉండడంతో వెంకయ్యకు ఛాన్స్ ఇవ్వాలనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. అయితే.. కన్నడ జనం మాత్రం వెంకయ్య కర్ణాటకకు ఒరగబెట్టిందేమి లేదని మండిపడుతున్నారు. రాష్ట్రంలో మరో నేత లేనట్టు ఏపీకి చెందిన వెంకయ్యను రాజ్యసభకు పంపించడమెందుకని ప్రశ్నిస్తున్నారు.

కర్ణాటక నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నా.. వెంకయ్య ఏపీ ప్రయోజనాల గురించి తప్పితే కర్ణాటక గురించి అసలు పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఇంకొంతమందైతే అసలు తమకు ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయి 18 ఏళ్ల అవుతుందని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మరో నెటిజన్.. వెంకయ్య తన పదవీ కాలంలో సాధించిన ఘనతల గురించి వివరిస్తూ.. ఏపీలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడం, హిందీ నేర్చుకోవడానికి కష్టపడి అసలు కన్నడ నేర్చుకోవడాన్ని పట్టించుకోలేదని సెటైర్ వేశారు.

English summary
karanataka people opposing venkaiah naidu to get rajyabha seat from karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X