వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ కుట్రలు ఫలించలేదు, ఆపలేరు: బాబుపై పురంధేశ్వరి, కృష్ణంరాజు, రాంమాధవ్ ఎదురుదాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతలు, కేంద్ర మాజీ మంత్రులు పురంధేశ్వరి, కృష్ణంరాజులు స్పందించారు. కర్నాటకలో బీజేపీ మెజార్టీ స్థానాల దిశగా సాగుతోంది. మెజార్టీకి కావాల్సిన 113 స్థానాలను సులభంగా గెలుచుకుంటోంది.

ఈ నేపథ్యంలో వారు స్పందించారు. కర్నాటక ప్రజలు సిద్ధరామయ్యకు, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారని, వారి విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. కృష్ణంరాజు, పురంధేశ్వరిలతో పాటు రామ్ మాధవ్, నిర్మలా సీతారామన్‌లు కూడా ఎన్నికల ఫలితాలపై స్పందించారు.

కర్నాటకలో జేడీఎస్ ఆశలు గల్లంతు, కాంగ్రెస్ వ్యూహం రివర్స్: బీజేపీ చేతికి 21వ రాష్ట్రంకర్నాటకలో జేడీఎస్ ఆశలు గల్లంతు, కాంగ్రెస్ వ్యూహం రివర్స్: బీజేపీ చేతికి 21వ రాష్ట్రం

తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ఫలించలేదు: కృష్ణంరాజు

తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ఫలించలేదు: కృష్ణంరాజు

కర్నాటకలో గెలుపుతో తమ పార్టీ ఉత్తర భారత దేశ పార్టీ అనే అపోహ తొలగిపోయిందని కృష్ణంరాజు అన్నారు. కర్నాటక తెలుగు ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలిపారు. కర్నాటకలో బీజేపీ ఓటమికి తెలుగుదేశం పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీదే విజయం అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ గెలుపును ఆపడం ఎవరితరమూ కాదన్నారు.

మా దక్షిణాది యాత్ర ప్రారంభం: రామ్ మాధవ్

మా దక్షిణాది యాత్ర ప్రారంభం: రామ్ మాధవ్

దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి ప్రారంభమైందని రామ్ మాధవ్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా కర్నాటక తెలుగు ఓటర్లు తిరస్కరించారన్నారు. మా దక్షిణాది యాత్ర కర్నాటక నుంచే ప్రారంభమైందని పేర్కొన్నారు. హైదరాబాద్ కర్నాటకలో 6 నుంచి 20 స్థానాలకు పెరిగామన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

టీడీపీ కలలు నెరవేరలేదు: విష్ణు కుమార్ రాజు

టీడీపీ కలలు నెరవేరలేదు: విష్ణు కుమార్ రాజు

బీజేపీ ఓడిపోవాలన్న చంద్రబాబు, టీడీపీ కలలు నెరవేరలేదని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు అన్నారు. చంద్రబాబు మాటను కర్నాటక తెలుగు ప్రజలు పట్టించుకోలేదన్నారు. 2019లోను చంద్రబాబు మాటను తెలుగు ప్రజలు నమ్మరని చెప్పారు.

ఏపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది

ఏపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది


కర్నాటకలో బీజేపీ గెలుపును ఎవరు ఆపలేకపోయారని బండారు దత్తాత్రేయ అన్నారు. కేసీఆర్, చంద్రబాబులు పిలుపునిచ్చినా తెలుగు ప్రజలు బీజేపీకే ఓటేశారన్నారు. బీజేపీపై కన్నడ ప్రజలు విశ్వాసం ఉంచారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీపై తప్పుడు ప్రచారాన్ని తెలుగు ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు. ఏపీ సహా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేక తీర్పు

కాంగ్రెస్‌కు వ్యతిరేక తీర్పు

సిద్ధరామయ్యకు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కర్నాటక ప్రజలు, అక్కడి తెలుగు ప్రజలు తీర్పు ఇచ్చారని పురంధేశ్వరి అన్నారు. ఏపీ, తెలంగాణలకు కేంద్రం సాయం చేయడం లేదని ఇక్కడి నేతలు చెప్పడం సరికాదని ఆమె అన్నారు. అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారన్నారు.

English summary
Andhra Pradesh Bharatiya Janata Party leader on BJP win on Karnataka Assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X