వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ దారిలో సిద్దు:బెంగుళూరులో తెలుగు టెక్కీలకు షాక్

స్థానికులకే ఐ.టి కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్ తో కొత్త చట్టాన్ని తెచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ చట్టం వస్తే కర్నాటక రాష్ట్రంలోని ఐటి కంపెనీల్లో పనిచేస్తోన్న తెలుగువారి ఉ

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు :కర్ణాటక రాష్ట్రంలోని ఐటి కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా చట్టాలను రూపొందిస్తే స్థానికేతరులకు ఉద్యోగాలు దక్కకుండా పోతాయా. బెంగుళూరు రాష్ట్రంలో ఉన్న ఐటి కంపెనీల్లో పనిచేస్తోన్న తెలుగువారు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొంటుందనే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయాలని నిర్ణయించింది కర్ణాటక తెలుగు ప్రజా సమితి.

అమెరికాలోని ఐటి ఉద్యోగాలన్నీ అమెరికన్లకే దక్కేలా చూస్తానని అమెరికా అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎన్నికల్లో ఆయన ఈ అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ ప్రచార అస్త్రం ఆయనకు ఎన్నికల్లో బాగా ఉఫయోగపడింది. స్థానికులకే ఉద్యోగావకాశాల కల్పించేందుకు కృషిచేస్తామని ఆయన చేసిన ప్రకటన పట్ల అమెరికన్లు ఆయనకు మద్దతుగా నిలిచారు.

ఇదే తరహలో కర్ణాటకలో చట్టాన్ని తీసుకురావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే కర్ణాటక రాష్ట్రంలోని పలు ఐటి కంపెనీల్లో పనిచేసే తెలుగువారి ఉద్యోగాలకు ఎసరు వచ్చే అవకాశం నెలకొంది.

బెంగుళూరులోని పలు ఐటి కంపెనీల్లో తెలుగువారు ఎక్కువగా పనిచేస్తున్నారు. మంచి హోదాల్లో పలు కంపెనీల్లో తెలుగువారు ఆయా ఐటి కంపెనీల్లో పనిచేస్తున్నారు. అయితే కర్ణాటక ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చే చట్టం వల్లే స్థానికేతరులకు ఉద్యోగాలు దక్కకుండా పోయే అవకాశాలున్నాయి. ఇవే పరిస్థితులు వస్తే ఆయా కంపెనీల్లో పనిచేసే తెలుగువారితో పాటు స్థానికేతరులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళాల్సిన పరిస్థితులు అనివార్యం కానున్నాయి.

karnataka state governament prepare new act for local people in i.t sector jobs

బెంగుళూరులో ఉన్న ఐటి కంపెనీల్లో పనిచేసే ఐటి ఉద్యోగాల్లో స్థానికులకే ఎక్కువగా దక్కేలా చట్టం తేవడం ద్వారా ఎక్కువగా తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన వారు నష్టపోయే ప్రమాదం ఉంది.

ఈ చట్టం వల్ల తెలుగురాష్ట్రాలకు చెందిన ఐటి కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కర్ణాటకలో ఉన్న తెలుగువారు నష్టపోయే ప్రమాదం ఉందని కర్ణాటకలో తెలుగువారి కోసం పనిచేస్తోన్న కర్ణాటక తెలుగు ప్రజా సమితి అభిప్రాయపడుతోంది.

ఈ విషయమై రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు స్పందించాలని కర్ణాటక తెలుగు ప్రజా సమితి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు లేఖలను రాయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.కర్ణాటకలోని పలు ఐటి కంపెనీలు స్థానికంగా ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వకపోతే వారికి రాయితీలు ఇవ్వబోమని ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆ సంస్థ తప్పుబట్టింది.

కర్ణాటక, తెలుగు ప్రజల మద్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించేలా ఈ ప్రయత్నాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని సంస్థ వ్యక్తం చేసింది. కర్ణాటక, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడూ కలిసి మెలిసి ఉండేవారని ఆ సంస్థ గుర్తుచేస్తోంది.

English summary
karnataka state governament prepare new act for local people in i.t sector jobs, thousands of telugu people losses their jobs in i.t sector
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X