కాంగ్రెసుకు ఝలక్: చేతులెత్తేసిన కాసు కృష్ణారెడ్డి

Kasu Krishna Reddy rejected to contest
గుంటూరు: కాంగ్రెస్ నేత కాసు వెంకట కృష్ణారెడ్డి ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఆయనకు నార్సరావుపేట లోకసభ టికెట్‌ను కాంగ్రెస్ అధిష్టానం కేటాయించింది. అయితే అక్కడ తాను పోటీ చేయలేనని కాసు ప్రకటించారు. ఆ స్థానంలో మరొకరిని నిలబెట్టాలని అధిష్టానానికి కాసు సూచించినట్లు తెలుస్తోంది.

తాను పోటీ చేయలేననే విషయాన్ని పిసిసికి చెప్పానని, గత్యంతరం లేదంటే అప్పుడు ఆలోచిస్తానని కాసు వెంకటకృష్ణా రెడ్డి అన్నారు. నర్సారావుపేట శాసనసభ నియోజకవర్గానికి పోటీ చేయలేనని కాసు వెంకటకృష్ణా రెడ్డి తనయుడు మహేష్ రెడ్డి బుధవారంనాడే చెప్పారు.

గత 60 ఏళ్లుగా కాసు కుటుంబానికి నర్సారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెసుతో అనుబంధం ఉంది. దాంతో తాను పోటీ చేయడం లేదని కాసు కృష్ణా రెడ్డి ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ స్థితిలో కాంగ్రెసు కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిన స్థితిలో పడింది.

గుంటూరు జిల్లా మంగళగిరి మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల కూడా తాను పోటీ చేయడం లేదని ఇదివరకే ప్రకటించారు. కాంగ్రెసుకు సీమాంధ్రలో ఈ విధమైన ఇబ్బందులు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+