విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ గొప్పలపైనే! హింసిస్తున్నారు: మరోసారి కత్తి మహేష్ విమర్శలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై సినీ క్రిటిక్ కత్తి మహేష్ విమర్శల దాడి ఆపడం లేదు. ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్‌ను లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్న కత్తి మహేష్.. అదే పని కొనసాగిస్తున్నారు.

అజ్ఞానవాసి!: పవన్‌పై మరోసారి కత్తి మహేష్ తీవ్ర వ్యాఖ్య, ఆర్ కృష్ణయ్య కౌంటర్అజ్ఞానవాసి!: పవన్‌పై మరోసారి కత్తి మహేష్ తీవ్ర వ్యాఖ్య, ఆర్ కృష్ణయ్య కౌంటర్

పవన్ తన పర్యటనలో చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. విమర్శలు సంధిస్తున్నారు. అజ్ఞానవాసి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ నోరు విప్పిన ప్రతీసారీ ఈ విషయం తెలుస్తుందని అన్నారు.

హింసిస్తున్నారు..

హింసిస్తున్నారు..

‘నా జీవితంలోకి వ‌చ్చి, నా ఫోన్ నెంబ‌రుని ప‌బ్లిక్‌లో పెట్టి, ఎంత‌గానో హింసించి నా జీవితంలోకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంశాన్ని తీసుకొచ్చారు ఆయ‌న అభిమానులు 'అని సినీ క్రిటిక్ మ‌హేశ్ క‌త్తి అన్నారు.

ఇప్పటికీ వేధిస్తున్నారు..

ఇప్పటికీ వేధిస్తున్నారు..

ప‌దే ప‌దే ప‌వ‌న్ కళ్యాణ్‌పై విమ‌ర్శ‌లు చేస్తోన్న మ‌హేశ్ క‌త్తి శుక్రవారం మీడియాలో చ‌ర్చ‌కు వ‌చ్చిన సందర్భంగా వివ‌ర‌ణ ఇచ్చారు. తాను ఏ సినిమాకి రివ్యూలు రాసినా వాటి కింద త‌న‌ను కించ‌ప‌రుస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నార‌ని అన్నారు. ఇప్ప‌టికీ త‌న‌ను సోష‌ల్ మీడియాలో వేధిస్తున్నార‌ని తెలిపారు.

పవన్ గొప్పలపైనే..

పవన్ గొప్పలపైనే..

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌క్తిగ‌త జీవితం గురించి తాను ఎటువంటి వ్యాఖ్య‌లూ చేయ‌డం లేద‌ని, ప‌వ‌న్ చెప్పుకుంటోన్న గొప్ప‌ల‌పైనే నిజాలు చెబుతున్నాన‌ని మ‌హేశ్ క‌త్తి అన్నారు. ప‌వ‌న్‌లో ఏదో మేజిక్ ఉంద‌ని కొంద‌రు అంటున్నార‌ని అన్నారు.

బాబుకు లాభం చేసేలా.. హోదా కోసం ఏం చేశారు?

బాబుకు లాభం చేసేలా.. హోదా కోసం ఏం చేశారు?

చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి లాభం చేకూర్చేలా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. ప్ర‌త్యేక హోదా కోసం పోరాడ‌దామ‌ని చెప్పిన ప‌వ‌న్.. ఆనాడు విశాఖ ప‌ట్నానికి కూడా రాలేద‌ని, తాను మాత్రం వెళ్లాన‌ని తెలిపారు. ఆయ‌న వ‌స్తే లా అండ్ ఆర్డ‌ర్ పాడ‌వుతుంద‌ని చెప్పుకున్నార‌ని అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌త్యేక హోదా కోసం ప‌వ‌న్ ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు.

English summary
Film critic Kathi Mahesh again targeted Janasena Party president Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X