వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా మీ పార్టీ వాళ్లేగా, అవి పంచుకున్న బ్యాచ్ ఎక్కడ?: టీడీపీ నేతలపై కత్తి మహేష్ సంచలనం

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సినీ విమర్శకుడు కత్తి మహేష్.. ఈసారి టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాటంలో సినీ పరిశ్రమ కలిసిరావడం లేదంటూ.. అసలు సినీ పరిశ్రమకు ఏమైందంటూ టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ చేసిన విమర్శలపై కత్తి మహేశ్ ఘాటుగా స్పందించారు.

'ఏపీ ప్రత్యేక హోదా కోసం అన్నీ వర్గాల వారు మద్దతు ఇస్తుంటే సినీ పరిశ్రమ ఎందుకు ముందుకు రావడం లేదు. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమాన్ని అక్కడి పరిశ్రమ ముందుండి నడిపించింది. తెలుగు చిత్రపరిశ్రమకు చేవ చచ్చిపోయిందా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎంపీ కవిత, మంత్రులంతా మద్దతు ఇస్తుంటే.. సినీ ప్రముఖులకు ఏమైంది?' అని రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.

kathi-mahesh

ఈ నేపథ్యంలో శివాజీ, పవన్ కళ్యాణ్, నిఖిల్ సిద్దార్థ, సంపూర్ణేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, మంచు మనోజ్, కొరటాల శివ, తాను అంతకుముందే ప్రత్యేక హోదా గురించి మాట్లాడామని, ఉద్యమాలలో పోరాడామని అన్నారు. నిన్నటికి నిన్న కళ్ళు తెరిచి హోదా రాగం ఎత్తుకున్న టీడీపీ నాయకులకు కళ్ళు నెత్తికెక్కినట్టు ఉన్నాయంటూ కత్తి మహేష్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

సినీ పరిశ్రమను అనవసరంగా బదనాం చేయొద్దని, మాటలు జాగ్రత్త! అని ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. 'ఉన్న హీరోలందరూ ఏదో ఒక రకంగా మీ పార్టీకి సంబంధించిన వాళ్లేగా! బాలకృష్ణ ఒక్కరు చాలరా? అవార్డులు పంచుకున్న బ్యాచ్ ఎక్కడ? మీరు వైజాగ్‌లో భూములు ఇచ్చిన స్టార్లు ఎక్కడ? బొడ్డు, జఘనాల డైరెక్టర్ తిరుమలలోనే ఉన్నారుగా? బోయపాటి శీను ఎక్కడా?' అంటూ తన ట్వీట్‌లో కత్తి మహేష్ ప్రశ్నలు గుప్పించారు.

English summary
Cine Critiq Kathi Mahesh fired on TDP leader Rajendra Prasad's comments on Cine Industry over Special Status for AP here in twitter on Tuesday. He said that most of the heroes of the telugu film industry belongs to TDP. He also questioned circasticly that where is the batch who shared the nandi awards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X