విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అజ్ఞానవాసి!: పవన్‌పై మరోసారి కత్తి మహేష్ తీవ్ర వ్యాఖ్య, ఆర్ కృష్ణయ్య కౌంటర్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Pawan Kalyan Tour : Mahesh Kathi Post Against Pawan Kalyan Going Viral | Oneindia Telugu

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు సినీ క్రిటిక్ కత్తి మహేష్. ఇప్పటికే పలుమార్లు పవన్ పై విమర్శలు చేసి.. ఆయన అభిమానుల నుంచి బెదిరింపులను కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

చిరు చేసిందేంటి?: పవన్‌పై మరోసారి కత్తి మహేష్ తీవ్ర విమర్శలుచిరు చేసిందేంటి?: పవన్‌పై మరోసారి కత్తి మహేష్ తీవ్ర విమర్శలు

పవన్‌తో పరిచయం లేదు, బాబు మనిషే: జగన్, 'స్పీడ్ ఎక్కువ-ఫీడ్‌బ్యాక్ తక్కువ' పవన్‌తో పరిచయం లేదు, బాబు మనిషే: జగన్, 'స్పీడ్ ఎక్కువ-ఫీడ్‌బ్యాక్ తక్కువ'

అయితే, తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం పర్యటనలో పవన్ చేసిన వ్యాఖ్యలపై కత్తి మహేష్ తీవ్రంగా స్పందించారు.

పవన్ వ్యాఖ్యలపై కత్తి సోషల్ మీడియాలో..

పవన్ వ్యాఖ్యలపై కత్తి సోషల్ మీడియాలో..

పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో పవన్ వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో పవన్ మాట్లాడుతున్న ప్రతి అంశంపై విమర్శలు చేస్తున్నారు కత్తి మహేష్. తాజాగా కత్తి మహేష్ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.

అజ్ఞానవాసి అంటూ..

‘నోరువిప్పిన ప్రతిసారీ అజ్ఞాతవాసి కాదు.. అజ్ఞానవాసి అని తేలుతోంది. అంతే!' అంటూ కత్తి మహేష్ తాజాగా పవన్ పై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, ఈ పోస్ట్‌పై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, పవన్ ఫ్యాన్స్ తన వెంట పడ్డారని, ఇప్పుడు, పవన్ వెంట తాను పడుతున్నానని మహేశ్ కత్తి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ లో ఆయన మాట్లాడుతూ.. ‘‘కాటమరాయుడు' సినిమా అప్పుడు నేను మాట్లాడితే, పవన్ ఫ్యాన్స్ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ‘మా దేవుడిని అంటావా?' అంటూ పవన్ ఫ్యాన్స్ నన్ను విమర్శించారు. నేను ప్రజాస్వామ్యంలో ఉన్నా. రాజ్యాంగబద్ధంగా బతుకుతున్నా. ఒక వ్యక్తిని దేవుడిని చేసేంత మూర్ఖత్వం నాలో లేదు. ఇలాంటి మూర్ఖత్వాన్ని నేను సహించను. నా మీద అప్రజాస్వామికమైన దాడి చేస్తే నేను సైలెంట్ గా ఉన్నాను. అందుకనే, నేను ఇప్పుడు పవన్ కల్యాణ్ ని సహేతుకంగా, రాజ్యాంగబద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటాను. ‘అజ్ఞాతవాసి'ని ‘అజ్ఞానవాసి' అని నేను అనడం వ్యక్తిగత విమర్శకాదు. ఆయన అజ్ఞానం గురించే నేను మాట్లాడుతున్నాను. అతను అజ్ఞాని కాదా? మేధావితనంతో మాట్లాడుతున్నాడా? ఏ విషయంలోనూ ఆయన మేధావితనంతో మాట్లాడలేదు. చర్చకు రమ్మనమనండి..అతని మేధావితనం ఏంటో నాకూ తెలుస్తుంది’ అని మహేశ్ కత్తి అన్నారు.

పవన్.. ఆ విషయం తెలియదా?

పవన్.. ఆ విషయం తెలియదా?

పవన్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య మాట్లాడుతూ.. మంజునాథ కమిషన్ నివేదిక ఇవ్వకముందే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడం తప్పని పవన్‌కు తెలియదా? అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలపై పవన్‌ ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లకు బీసీలంతా వ్యతిరేకమని ఈ సందర్భంగా ఆయన వివరించారు. డిసెంబర్‌ 24న మైలవరంలో బీసీ సింహగర్జన నిర్వహిస్తున్నట్లు ఆర్‌.కృష్ణయ్య స్పష్టం చేశారు.

తెలంగాణ అలా రాలేదు: రిజర్వేషన్లపై పవన్, ఆర్ కృష్ణయ్యపై, రామ్మోహన్ నాయుడు కౌంటర్తెలంగాణ అలా రాలేదు: రిజర్వేషన్లపై పవన్, ఆర్ కృష్ణయ్యపై, రామ్మోహన్ నాయుడు కౌంటర్

దుమారం రేపుతున్న పవన్ వ్యాఖ్యలు

దుమారం రేపుతున్న పవన్ వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనలో చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. రాజమండ్రి పర్యటనలో రాజకీయ వారసత్వం, కాపుల రిజర్వేషన్లపై పవన్ సంచలన వ్యాఖ్యలే చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన టీడీపీ, బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు.

English summary
Film critic Kathi Mahesh on Thursday takes on at Janasean president Pawan Kalyan for his comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X