చిరు చేసిందేంటి?: పవన్‌పై మరోసారి కత్తి మహేష్ తీవ్ర విమర్శలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సినీ క్రిటిక్ మహేష్ కత్తి మరోసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఇప్పటికే పలుమార్లు విమర్శలు చేసిన ఆయన.. విశాఖ పర్యటనపై కూడా స్పందించారు. ఒకేసారి రెండు పిట్టలంటూ ఎద్దేవా చేశారు.

పవన్‌తో పరిచయం లేదు, బాబు మనిషే: జగన్, 'స్పీడ్ ఎక్కువ-ఫీడ్‌బ్యాక్ తక్కువ'

మంచి నిర్ణయం, ఇదీ లెక్క! ఒక్క దెబ్బకు రెండు పిట్టలు: పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్

ఇప్పుడు మరోసారి కత్తి మహేష్.. పవన్ కళ్యాణ్‌పై ఆరోపణలు ఎక్కుపెట్టారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ పవన్‌ను కోరారు. త‌న అన్న‌య్య‌ చిరంజీవికి ద్రోహం చేసిన వారిని జనసేన ద్వారా దెబ్బకొడదామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖలో చేసిన వ్యాఖ్యలపై మ‌హేశ్ క‌త్తి విమర్శలు చేశారు.

చిరు చేసిందేంటో..?

చిరు చేసిందేంటో..?

'అన్న (చిరంజీవి)ను, పీఆర్‌పీని మోసం చేసినవాళ్ల సంగతి సరే... మరి అన్న గారు జనానికి, కులానికి, పార్టీకి చేసిన మోసం సంగతో..?' అంటూ మ‌హేశ్ క‌త్తి సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు.

ఇదే కొత్తరకం రాజకీయం

ఇదే కొత్తరకం రాజకీయం

కొత్త‌ ర‌క్తం, కొత్త‌ త‌ర‌హా రాజకీయాలు కావాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న మాట‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ‘పార్టీ ఆఫీసుని సినిమా ఆఫీసులా, ప్రజా ప్రస్థానాన్ని ఆడియో లాంచ్ లాగా మార్చడమే కొత్త తరహా రాజకీయం' అంటూ ఎద్దేవా చేశారు.

ప్రజారాజ్యంలా జనసేన

ప్రజారాజ్యంలా జనసేన

టీడీపీ, బీజేపీకి ఇక‌ మద్దతు ఇవ్వమ‌ని పవన్ కల్యాణ్ ఈ రోజు అన్నార‌ని, 'ఇక మిగిలింది వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్...చలో' అని మ‌హేశ్‌క‌త్తి అన్నారు. తాను చేసిన ట్వీట్‌ల‌పై ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడిన మ‌హేశ్‌క‌త్తి.. జ‌న‌సేన కూడా ప్ర‌జారాజ్యం పార్టీలాగే త‌యార‌యింద‌ని విమ‌ర్శించారు.

పవన్ అభిమానులతో సిద్ధం..

పవన్ అభిమానులతో సిద్ధం..

విధాన‌ప‌రంగా ప్ర‌జారాజ్యం పార్టీకి, జ‌న‌సేన పార్టీకి తేడా లేద‌ని కత్తి మహేష్ అన్నారు. త‌న‌కి, ప‌వ‌న్ కళ్యాణ్ అభిమానుల‌కి మ‌ధ్య మ‌ళ్లీ గొడ‌వ మొద‌లైతే ఎదుర్కోవ‌డానికి తాను ఎప్ప‌టికీ సిద్ధ‌మేన‌ని అన్నారు. ప‌వ‌న్ అభిమానులు త‌మ తీరును అలాగే కొన‌సాగిస్తారా? లేదంటే మార‌తారా? అన్నది వారి ఇష్ట‌మ‌ని కత్తి మహేష్ చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Film critic Kathi Mahesh on Wednesday targeted Janasena Party president Pawan Kalyan again.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X