వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ తేల్చేసారు : ఏపి హోదాకు స‌హ‌క‌రిస్తాం: పోల‌వ‌రం కు అడ్డుప‌డం: జ‌గ‌న్ కు గ్రేట్ రిలీఫ్..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ తేల్చి చెప్పేసారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపిలో టిడిపి అధినేత చంద్ర‌బాబు త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో కేసీఆర్ ను ల‌క్ష్యంగా చేసుకొని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల పై నోరు వి ప్ప‌ని కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసారు. ఏపికి ప్ర‌త్యేక హోదాకు స‌హ‌క‌రిస్తామ‌ని తేల్చి చెప్పారు. పోల‌వ‌రం కు ఎప్పుడూ అడ్డు ప‌డ‌లేద‌ని స్ప‌ష్టం చేసారు. బాబు తో మిన‌హా ఏపి ప్ర‌జ‌ల‌తో గొడ‌వ లేద‌ని తేల్చి చెప్పారు..

<strong>జ‌గ‌న్ లా టిక్కెట్లు అమ్ముకోను : ఆయ‌న మామ న‌న్ను బెదిరించారు: ఆలీ..ఇదే నా స్నేహం: ప‌వ‌న్ ఫైర్‌..!</strong>జ‌గ‌న్ లా టిక్కెట్లు అమ్ముకోను : ఆయ‌న మామ న‌న్ను బెదిరించారు: ఆలీ..ఇదే నా స్నేహం: ప‌వ‌న్ ఫైర్‌..!

కేసీఆర్ తేల్చి చెప్పేసారు..

కేసీఆర్ తేల్చి చెప్పేసారు..

తెలంగాణ ముఖ్య‌మంత్రి తొలి సారిగా టిడిపి అధినేత చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల పై స్పందించారు. ఏపి ప్ర‌త్యేక హోదా కు తాము వ్య‌తిరేకం కాద‌ని తేల్చి చెప్పారు. ఏపి ప్ర‌త్యేక హోదాకు స‌హ‌క‌రిస్తామ‌ని ఎన్నిక‌ల స‌భ లో స్ప‌ష్టంగా ప్ర‌క‌టిం చారు. తాము పూర్తిగా హోదా కోసం స‌హ‌క‌రిస్తామ‌ని..ఇది టిఆర్‌య‌స్ విధాన‌మ‌ని తేల్చి చెప్పారు. అదే విధంగా కొంద‌రు ప్ర‌చారం చేస్తున్న‌ట్లుగా పోల‌వ‌రం కు తాము అడ్డుప‌డ‌లేద‌ని చెప్పుకొచ్చారు. త‌మ‌కు రావాల్సిన గోదావ‌రి లో రావాల్సిన‌ 1000 టిఎంసి ల నీరును మాత్రం తీసుకుంటామ‌న్నారు. అదే విధం గా ఏపి ప్ర‌జ‌ల‌తో త‌మ‌కు ఎప్పుడూ గొడ‌వ లేద‌ని స్ప‌ష్టం చేసారు. ఇక‌, చంద్ర‌బాబు లాంటి గుప్పెడు మందితో త‌ప్ప త మ‌కు ఏపి ప్ర‌జ‌ల‌తో పంచాయితీ లేద‌న్నారు. వికారాబాద్ లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌భ‌లో కేసీఆర్ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసారు. బాబు లాంటి వారితో త‌ప్ప అని చెప్ప‌టం ద్వారా చంద్ర‌బాబు త‌మ పై చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను సీరియ‌స్ గా తీసుకుంటున్న‌ట్లు స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. ఎన్నిక ల్లో బాబు డిపాజిట్లు కోల్పోతార‌ని జోస్యం చెప్పారు.

చంద్ర‌బాబుకు స‌మాధానం దొరికిన‌ట్లేనా..

చంద్ర‌బాబుకు స‌మాధానం దొరికిన‌ట్లేనా..

ఎన్నిక‌ల ప్ర‌చారం లో జ‌గ‌న్ ను ఇబ్బంది పెట్ట‌టానికి ఏపి ప్ర‌జ‌ల‌ను దూషించిన కేసీఆర్ తో జ‌గ‌న్ జ‌త క‌ట్టార‌ని.. ఆయ న ఏపికి ప్ర‌త్యేక హోదా కు వ్య‌తిరేక‌మ‌ని చంద్రబాబు ప్ర‌తీ స‌భ‌లో చెప్పుకొచ్చారు. ఏపికి హోదా కోస‌మే కేసీఆర్ తో తాను క‌లిసాన‌ని జ‌గ‌న్ చెప్ప‌టాన్ని ప్ర‌స్తావిస్తూ..కేసీఆర్ ఏపికి ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తు ఇస్తాన‌ని జ‌గ‌న్ చెవిలో చెప్పా రా అని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ చెప్పేది నిజ‌మైతే కేసీఆర్ తో ప్ర‌క‌ట‌న చేయించాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేసారు. కేంద్రానికి లేఖ రాయాల‌ని కోరారు. అదే విధంగా కేసీఆర్ ఏపిలో పోల‌వ‌రానికి అడ్డుప‌డుతున్నార‌ని.. ఇత‌ర ప్రాజెక్టుల ను నిలిపివేయాల‌ని కృష్ణా బోర్దుకు లేఖ రాసార‌ని చెప్పుకొచ్చారు. కేసీఆర్ గ‌తంలో ఆంధ్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌దే ప‌దే చంద్ర‌బాబు ప్ర‌స్తావిస్తున్నారు.

జ‌గ‌న్ కు రిలీఫ్‌..

జ‌గ‌న్ కు రిలీఫ్‌..

చంద్రబాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ ను త‌ప్పు బడుతూ..కేసీఆర్ తో హోదా కోసం జ‌త కట్టాన‌ని చెబుతున్నాడ‌ని.. ఎప్పుడు చెప్పాడ‌ని ప్ర‌శ్నిస్తూ వ‌చ్చారు. అయితే, జ‌గ‌న్ మాత్రం త‌న ప్ర‌చార స‌భ‌ల్లోనూ..ఇంట‌ర్వ్యూల్లోనూ ఇదే విష యాన్ని చెబుతూ వ‌చ్చారు. ఏపి నుండి 25 మంది ఎంపీలు..తెలంగాణ నుండి 17 మంది ఎంపీలు క‌లిసి క‌ట్టుగా ఏపి కి ప్ర‌త్యేక హోదా కోసం పోరాడితే ఖ‌చ్చితంగా హోదా వ‌స్తుంద‌ని చెబుతూ వ‌చ్చారు. ఇక‌, ఇప్పుడు కేసీఆర్ స్వ‌యంగా ఇదే విష‌యాన్ని ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో స్ప‌ష్టంగా ప్ర‌క‌టించటం..అందునా ఏపికి హోదాకు స‌మ‌ర్ధించాల‌నే అంశం త‌మ పార్టీ విధాన‌మ‌ని స్ప‌ష్టం చేయ‌టం ద్వారా ఎన్నిక‌ల ముంగిట వైసిపి అధినేత జ‌గ‌న్ కు గొప్ప రిలీఫ్ దొరికిన‌ట్లుగా భావిం చాల్సి ఉంటుంది. మ‌రి..దీని పై చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

English summary
Telangana CM KCR key announcement on AP Special stauts. KCR says TRS will support AP Special status and says this is Party decision. Kcr also clarified that they are not against Polavaram. We are not against AP Public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X