• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ముహూర్తం ఖ‌రారు , 14 న జ‌గ‌న్ - కేసీఆర్ క‌లిసేది అక్క‌డే : ఫిక్స్ చేస్తారా..!

|

ఏపి-తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి క‌లిగించే ప‌రిణామం. ఈ నెల 14న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏపికి రానున్నారు. ఏపి లో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. ఏపి ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు రిటర్న్ గిప్ట్ ఇస్తామ‌ని ఇప్ప‌టికే కేసీఆర్ ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ తో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో చేరాలంటూ తొలి విడ‌త చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఇక‌, ఇప్పుడు కెసీఆర్ జ‌గ‌న్ ఇద్ద‌రూ ముఖాముఖి క‌లు సుకోబోతున్నారు. ఇందుకు ఆ ప్రాంగ‌ణం వేదిక కానుంది..దీంతో..ఇప్పుడు అంద‌రి దృష్టి అటువైపే..

14న ఏపికి కేసీఆర్‌..

14న ఏపికి కేసీఆర్‌..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ నెల 14న ఏపి ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. కొద్ది రోజుల క్రితం విశాఖ‌లోని శార‌దా పీఠం కు విచ్చేసిన కేసీఆర్ తిరిగి స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తి ఆహ్వానం మేర‌కు శార‌దా పీఠానికి వ‌స్తున్నారు. ఈ నెల 10 నుండి 14 వ తేదీ వ‌ర‌కు ఈ పీఠం లో వార్షికోత్స‌వాలు జ‌రుగుతున్నాయి. 14న జ‌రిగే పూర్ణాహుతి లో కేసీఆర్ పాల్గొంటార‌ని స‌మాచా రం. దీని కోసం ఆయ‌న హైద‌రాబాద్ నుండి నేరుగా విశాఖ కు రానున్నారు. ఇప్ప‌టికే కేసీఆర్ కోసం స్వ‌రూపానంద రాజ శ్యామ‌ల యాగం నిర్వ‌హించారు. ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత రాజ శ్యామ‌ల ను ద‌ర్శించుకొనేందుకు కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి విశాఖ కు వ‌చ్చారు. అయితే, తెలంగాన ఎన్నిక‌ల్లో విజ‌యం త‌రువాత ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు లక్ష్యంగా కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తామ‌ని చెప్పుకొచ్చారు. దీంతో..ఏపిలో ఎన్నిక‌ల వేళ‌..కేసీఆర్ విశాఖ‌కు వ‌స్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ప‌ర్య‌ట‌న ఆస‌క్తి క‌రంగా మారింది.

జ‌గ‌న్ - కేసీఆర్ భేటీ అక్క‌డే..!

జ‌గ‌న్ - కేసీఆర్ భేటీ అక్క‌డే..!

ఏపి రాజ‌ధాని ప‌రిధిలో నూత‌నంగా నివాసం ఏర్ప‌టు చేసుకున్న జ‌గ‌న్ ఈ నెల 14న ఆ ఇంట్లోకి గృహ‌ప్ర‌వేశం చేయ‌ను న్నారు. 14వ తేదీ ఉద‌యం 8.21 గంట‌ల‌కు జ‌గ‌న్ గృహ‌ప్ర‌వేశ ముహూర్తం. అయితే, కొద్ది రోజుల క్రితం జ‌గ‌న్ తో ఫెడ ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ ఫోన్ చేసారు. ఈ చ‌ర్చ‌ల కోసం కేటీఆర్ ను పంపిస్తున్నాన‌ని..త్వ‌రలో తానే వ‌చ్చి క‌లుస్తా న‌ని చెప్పారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ త‌న గృహ‌ప్ర‌వేశానికి రావాల‌ని ఆహ్వానించారు. కేసీఆర్ సైతం అంగీక‌రిం చారు. స‌రిగ్గా అదే రోజు విశాఖ శార‌దాపీఠంలో కార్య‌క్రమం కోసం కేసీఆర్ అక్క‌డికి వ‌స్తున్నారు. కొంత కాలంగా జ‌గ‌న్ సైతం స్వ‌రూపానంద సూచ‌న‌ల మేర‌కు రుషికేష్ లో..హైద‌రాబాద్‌లో యాగాలు చేయించారు. విశాఖ‌లో జ‌రిగే కార్య‌క్ర మానికి హాజ‌రు కావాల‌ని జ‌గ‌న్ ను సైతం ఆయ‌న ఆహ్వానించారు. జ‌గ‌న్ ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు విశాఖ కు వెళ్తున్నారు. అక్క‌డే కేసీఆర్ - జ‌గ‌న్ ఇద్ద‌రూ క‌లుసుకోబోతున్నారు. దీంతో..ఆ ఇద్ద‌రూ ఒకే చోట‌కు రావ‌టం..అక్క‌డ క‌లుసుకొనే అవ‌కాశం ఉండ‌టంతో ఇప్పుడు అందరిలోనే ఆస‌క్తి పెరుగుతోంది.

ఫిక్స్ చేస్తారా..ఫిక్స్ అవుతారా..!

ఫిక్స్ చేస్తారా..ఫిక్స్ అవుతారా..!

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోసం కేటీఆర్ తో స‌మావేశ‌మైన స‌మ‌యంలోనే టిడిపి పెద్ద ఎత్తున వైసిపిని విమ‌ర్శించింది. ఏపి కి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్ తో ఎలా జ‌త క‌డ‌తారంటూ విమ‌ర్శ‌లు చేసారు. కేసీఆర్ ఏపి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్నారు. తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు పై ఏర‌కంగా అయితే టిఆర్‌య‌స్ వ్య‌వ‌హ‌రించిందో..అదే ప‌ని ఇప్పుడు ఏపిలో కేసీఆర్ పై టిడిపి చేస్తోంది. దీంతో..జ‌గ‌న్ సైతం ఇప్ప‌టికే స్ప‌ష్టంగా చెప్పారు. ఎవ‌రితోనూ పొత్తు ఉండ‌ద‌ని..జాతీయ స్థాయిలోనూ ఏపికి ప్ర‌త్యేక హోదాకు ఎవ‌రు సంక‌తం చేస్తే వారికే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తేల్చి చెప్పారు. దీంతో..ఇప్పుడు విశాఖ‌లో ఇద్ద‌రూ క‌లిసినా..ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో చేరే అంశం ఎన్నిక‌ల త‌రువాత మాత్ర‌మేన‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేసే అవ‌కాశం ఉంది. ఇదే స‌మ‌యంలో ఏపిలో ఎన్నిక‌ల పైనా వారు చర్చించే అవ‌కాశం ఉంది. మ‌రి..ఈ ఇద్ద‌రు చంద్ర‌బాబును త‌మ వ్యూహాల‌తో ఫిక్స్ చేస్తారా..లేక కేసీఆర్ తో భేటీ తో జ‌గ‌న్ ఫిక్స్ అవుతారా అనేది వేచి చూడాలి.

English summary
Telanagana Cm KCR visit Sarada peetham in Viaskha on 14th February. YCP Chief Jagan also attending same programme. In this occasion both leaders may met and discuss about AP Elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X