• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పరిటాల శ్రీరామ్‌తో ఆలింగనం, బాబుకు చేయి!: కేసీఆర్‌కు 'అనంత' స్వాగతం, ఎగబడ్డ జనం (పిక్చర్స్)

|
  పరిటాల శ్రీరామ్‌తో ఆలింగనం, బాబుకు చేయి.. కేసీఆర్‌కు 'అనంత' స్వాగతం, ఎగబడ్డ జనం..! | Oneindia Telugu

  అనంతపురం/హైదరాబాద్: ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిాల శ్రీరామ్‌-జ్ఞానల వివాహ వేడుక అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి పలువురు మంత్రులు, వీవీఐపీలు హాజరయ్యారు.

  పరిటాల శ్రీరామ్ పెళ్లికి భారీ బందోబస్తు: చంద్రబాబు-కెసిఆర్..

  వేడుకకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, కెసిఆర్‌లు హాజరయ్యారు. వివాహానికి హాజరైన అతిథులకు మంత్రి సునీత స్వయంగా స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున పెళ్లికి హాజరయ్యారు.

  పరిటాల శ్రీరామ్ పెళ్లిలో ఆసక్తికర సన్నివేశం, ఏకాంతంగా ఆరా తీసిన కెసిఆర్

  అనంతపురంలో కేసీఆర్ పర్యటన ఇలా

  అనంతపురంలో కేసీఆర్ పర్యటన ఇలా

  కాగా, పరిటాల శ్రీరామ్ పెళ్లిలో తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వెంకటాపురంలో పెళ్లికి హాజరైన కెసిఆర్.. విక్టరీ సింబల్ చూపిస్తూ, నమస్కారం పెడుతూ అందరినీ అలరించారు. పరిటాల శ్రీరామ్‌ను ఆలింగనం చేసుకున్నారు.

  బేగంపేట నుంచి పుట్టపర్తికి

  బేగంపేట నుంచి పుట్టపర్తికి

  కేసీఆర్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో అనంతపురం బయల్దేరారు. పుట్టపర్తికి విమానంలో చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వెంకటాపురం చేరుకున్నారు.

  కేసీఆర్‌కు అనంత స్వాగతం, ఏపీ టిడిపి నేతల ఘన స్వాగతం

  కేసీఆర్‌కు అనంత స్వాగతం, ఏపీ టిడిపి నేతల ఘన స్వాగతం

  మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న కేసీఆర్‌కు ఎమ్మెల్యేలు పల్లె రఘునాథ రెడ్డి, ప్రభాకర్ చౌదరి, స్థానిక నేతలు, సత్యసాయి ట్రస్టు సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులో ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అనంతపురం జిల్లాకు స్వాగతం పలికారు.

  తెలంగాణ సీఎంకు ఘన స్వాగతం

  తెలంగాణ సీఎంకు ఘన స్వాగతం

  వెంకటాపురంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద సీఎం కేసీఆర్‌కు రాజకీయ ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే, జిల్లా అధికారులు కూడా ఆయన స్వాగతం పలికారు.

  ఇరువురు సీఎంల ఆశీర్వాదం

  ఇరువురు సీఎంల ఆశీర్వాదం

  నూతన దంపతులను ఇరువురు సీఎంలు ఆశీర్వదించారు. తొలుత వేదిక వద్దకు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వెంకటాపురానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ నేరుగా వివాహ వేదిక వద్దకు చేరుకొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

  మంత్రి సునీత ఘన స్వాగతం

  మంత్రి సునీత ఘన స్వాగతం

  తన కుమారుడి వివాహ వేడుకకు విచ్చేసిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మంత్రి సునీత వేదిక వద్దకు సాదరస్వాగతం పలికారు. సినీనటులు మోహన్ బాబు, బాలకృష్ణలు, పలువురు రాష్ట్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.

  శ్రీరామ్‌ను ఆలింగనం చేసుకున్న కేసీఆర్

  శ్రీరామ్‌ను ఆలింగనం చేసుకున్న కేసీఆర్

  పెళ్లికి హాజరైన కేసీఆర్.. పరిటాల శ్రీరామ్‌ను ఆలింగనం చేసుకున్నారు. అనంతరం నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందజేసి వివాహా శుభాకాంక్షలు తెలిపారు.

  పరిటాల రవితో అనుబంధం గుర్తు చేసుకున్న కేసీఆర్

  పరిటాల రవితో అనుబంధం గుర్తు చేసుకున్న కేసీఆర్

  వివాహం అనంతరం దివంగ‌త నేత పరిటాల రవి ఘాట్‌ను కేసీఆర్‌ సందర్శించిన సమయంలో ఆయన వెంటే మంత్రి పరిటాల సునీత కూడా వెంట వచ్చారు. పరిటాల రవితో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.

  పరిటాల ఘాట్ వద్ద నివాళి

  పరిటాల ఘాట్ వద్ద నివాళి

  పరిటాల శ్రీరామ్‌ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి హాజరయ్యారు. అనంతపురం జిల్లా వెంకటాపురానికి మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి చేరుకున్న కేసీఆర్‌ నూతన దంపతులైన శ్రీరామ్‌, జ్ఞానలను ఆశీర్వదించారు. అనంతరం ఆయన పరిటాల రవీంద్ర ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. రవి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

  కేసీఆర్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు

  కేసీఆర్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు

  వివాహానికి హజరయ్యేందుకు విచ్చేసిన కేసీఆర్‌ను చూసేందుకు జ‌నం ఎగ‌బ‌డ్డారు. దీంతో ఆయ‌న‌ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

  అభివాదం చేస్తూ, విక్టరీ సింబల్ చూపిస్తూ

  అభివాదం చేస్తూ, విక్టరీ సింబల్ చూపిస్తూ

  తనను చూసేందుకు ఎగబడ్డ జనానికి, పరిటాల అభిమానులకు తెలంగాణ సీఎం కేసీఆర్ విక్టరీ సింబల్ చూపిస్తూ ముందుకు నడిచారు. కొన్నిసార్లు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు.

  పరిటాల శ్రీరామ్ పెళ్లి, సీఎంలపై సునీత

  పరిటాల శ్రీరామ్ పెళ్లి, సీఎంలపై సునీత

  తన కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహనికి పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి ఏపీ మంత్రి పరిటాల సునీత ధన్యవాదాలు తెలిపారు.తాను పిలవగానే చంద్రబాబు, కేసీఆర్ లు వచ్చారని చెప్పారు. అమ్మాయి వివాహం అయి వుంటే కనుక కేసీఆర్ దంపతుల సమక్షంలోనే పెళ్లి జరిగి ఉండేదని పరిటాల సునీత చెప్పారు. తన భర్తకు, కేసీఆర్ కు మధ్య స్నేహబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు.

  నిండు మనస్సుతో ఆశీర్వదించాలని..

  నిండు మనస్సుతో ఆశీర్వదించాలని..

  తన బిడ్డ శ్రీరామ్, జ్ఞానలు నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుఖంగా జీవించి ఉండేలా మంచి మనసుతో ఆశీర్వదించాలని సునీత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లను కోరారు. వివాహ వేడుకకు ముందు మీడియాతో ఆమె మాట్లాడారు. అబ్బాయి వివాహం కావడంతో వారు వచ్చి ఆశీర్వదించి వెళ్లినా తనకు అమితమైన ఆనందమేనని వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసిన ఆమె, పెళ్లి ఏర్పాట్లకు కష్టపడిన ప్రతి కార్యకర్తకూ కృతజ్ఞతలు తెలిపారు.

  చంద్రబాబు-కేసీఆర్ కరచాలనం

  చంద్రబాబు-కేసీఆర్ కరచాలనం

  వివాహానికి తొలుత చంద్రబాబు, ఆ తర్వాత కేసీఆర్ హాజరయ్యారు. చంద్రబాబు వెళ్తుండగా, కేసీఆర్ వచ్చారు. ఈ సమయంలో ఇద్దరు ఎదురుపడ్డారు. కరచాలనం చేసుకున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana Chief Minister, K Chandrasekhara Rao attended the wedding ceremony of Paritala Sriram a little while ago in Venkatapuram. KCR is accompanied by Tummala Nageshwara Rao and Errabelli Dayakara Rao, all who are colleagues of Paritala Ravi when in TDP.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more