వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్‌ జగన్‌కు కేసీఆర్‌ అభినందనలు..! ఇది ఊహించిన విజయమన్న జగన్..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Assembly Election Results 2019 : వైఎస్‌ జగన్‌కు కేసీఆర్‌ అభినందనలు.! || Oneindia Telugu

అమరావతి: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గురువారం ఫోన్‌ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు వైఎస్‌ జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ముందడుగు వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగు అవుతాయని ఆకాంక్షించారు. అంతే కాకుండా జగన్ మోహన్ రెడ్డి అనూహ్య విజయం పట్ల తెలంగాణ సీఎం తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు.

 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో దూసుకుపోతున్న జగన్..! అనూహ్య విజయమంటున్న శ్రేణులు..! !

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో దూసుకుపోతున్న జగన్..! అనూహ్య విజయమంటున్న శ్రేణులు..! !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ విజయం దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 152, లోక్ సభలో 25 స్థానాల్లో వైసీపీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఈ మేరకు ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ విజయాన్ని తాము ముందుగానే ఊహించామని జగన్ తెలిపారు. తమను ప్రజలు, భగవంతుడు ఆశీర్వదించారని వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం దిశగా దూసుకుపోతున్న ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీకి శుభాకాంక్షలు తెలిపారు.

 ప్రత్యేక హోదా మా ఏజెండా...! ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామన్న వైసీపి అధినేత..!!

ప్రత్యేక హోదా మా ఏజెండా...! ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామన్న వైసీపి అధినేత..!!

ప్రత్యేక హోదానే మా ఏజెండా అని, దాని కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించుకుంటామని ఏపీ వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. అఖండ విజయం సాధించిన బీజేపి కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం ఊహించినదేనని, ప్రజలు, దేవుడు వైసీపీని ఆశీర్వదించారన్నారు. ఎఐసీసీ అధినేత రాహుల్ గాంధీ గురించి ఇప్పుడేమీ మాట్లాడను అని, తరువాత మాట్లాడతానని అన్నారు.

జ‌గ‌న్ మెజార్టీ 70వేలు. చంద్ర‌బాబుకు 30వేలు..రోజా గెలుపు భావోద్వేగం..నేను గెల్డెన్ లెగ్..!జ‌గ‌న్ మెజార్టీ 70వేలు. చంద్ర‌బాబుకు 30వేలు..రోజా గెలుపు భావోద్వేగం..నేను గెల్డెన్ లెగ్..!

 ఇది ప్రజా విజయం..! అన్ని హామీలు నెరవేరుస్తామంటున్న జగన్..!!

ఇది ప్రజా విజయం..! అన్ని హామీలు నెరవేరుస్తామంటున్న జగన్..!!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌​ కాంగ్రెస​ పార్టీ విజయాన్ని తాము ఊహించిందేనని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదానే తమ అజెండాగా పేర్కొన్నారు. ప్రజలు, దేవుడు వైఎస్సార్‌సీపీనీ ఆశీర్వదించారన‍్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నరేంద్ర మోదీకి వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇక కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురించి ఇప్పుడే తానేమీ మాట్లాడనని వైఎస్‌ జగన్‌ అన్నారు.

 వైఎస్సార్‌సీపీకి అఖండ​ మెజారిటీ..! కాబోయే సీఎం జగన్...!!

వైఎస్సార్‌సీపీకి అఖండ​ మెజారిటీ..! కాబోయే సీఎం జగన్...!!

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ​ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 150 పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ కేవలం 24 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జనసేన ఒక స్థానానికే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 23 చోట్ల, టీడీపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌ వెనుకంజలో ఉన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందంజలో ఉన్నారు.

English summary
Telangana Chief Minister Chandrasekhar Rao telephoned YS Jaganmohan Reddy on Thursday. He congratulated YS Jagan for a strong victory in the AP Assembly polls. He hoped that Andhra Pradesh will take the lead in the leadership of YS Jagan Mohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X