వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీక్షా దివస్: తెలంగాణా వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో; తెలంగాణా ఉద్యమాన్ని చారిత్రాత్మక మలుపు తిప్పిన రోజు

|
Google Oneindia TeluguNews

నవంబర్ 29.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన రోజు. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు. ప్రజలలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రజ్వలింపజేసిన రోజు. సీఎం కేసీఆర్ మొక్కవోని దీక్షతో తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేసిన రోజు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ చేపట్టిన దీక్షకు నవంబర్ 29 2021 నాటికి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు సీఎంగా బంగారు తెలంగాణ సాధన కోసం ముందుకు సాగుతున్న కెసిఆర్, నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన దీక్షాదివస్ జ్ఞాపకాలు వన్ ఇండియా పాఠకుల కోసం ప్రత్యేకం.

మోడీ సర్కార్ టార్గెట్ గా కేసీఆర్ స్కెచ్: పార్లమెంట్ సమావేశాలకు పక్కా వ్యూహంతో టీఆర్ఎస్ రెడీ!!మోడీ సర్కార్ టార్గెట్ గా కేసీఆర్ స్కెచ్: పార్లమెంట్ సమావేశాలకు పక్కా వ్యూహంతో టీఆర్ఎస్ రెడీ!!

 మలిదశ ఉద్యమంలో తెలంగాణా కోసం ఆమరణ దీక్షకు దిగిన కేసీఆర్

మలిదశ ఉద్యమంలో తెలంగాణా కోసం ఆమరణ దీక్షకు దిగిన కేసీఆర్

2009 మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రోజుల్లో ఉద్యమాన్ని అణగదొక్కడం కోసం ఉమ్మడి సర్కార్ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. దీంతో తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్ 2009వ సంవత్సరంలో కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చడం కోసం తాను సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అన్న నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు కెసిఆర్. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తర్వాత పదకొండు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష సాగించిన కేసీఆర్ తన దీక్షను విరమించారు. తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయిందని ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు.

 ఖమ్మం జైలు నుండే ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన కేసీఆర్

ఖమ్మం జైలు నుండే ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన కేసీఆర్

నాడు కేసీఆర్ ప్రారంభించిన దీక్ష ఎలా సాగిందంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ ఒక్కడిగా పోరాటం సాగించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆమరణ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేట దగ్గర రంగధాంపల్లి లో ఏర్పాటు చేసిన దీక్షాస్థలి వద్దకు బయలుదేరారు. కేసీఆర్ వాహనాన్ని ముట్టడించిన పోలీసులు, ఆయన ఆమరణ నిరాహార దీక్షాస్థలి వద్దకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాడు కాంగ్రెస్ హయాంలోని ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు కెసిఆర్ ను వాహనం నుండి దించేశారు. దీంతో కెసిఆర్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో ఆయనను ఖమ్మం జైలుకు తరలించారు. ఖమ్మం జైలులోనే కెసిఆర్ తన దీక్షను ప్రారంభించారు.

 తెలంగాణా వస్తే జైత్ర యాత్ర .. లేకుంటే నా శవ యాత్ర అన్న కేసీఆర్

తెలంగాణా వస్తే జైత్ర యాత్ర .. లేకుంటే నా శవ యాత్ర అన్న కేసీఆర్

పట్టువదలని విక్రమార్కుడిలా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్ష చేశారు. ఆ తర్వాత నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన తరువాత ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. డిసెంబర్ 1వ తేదీన నేను లేకున్నా సరే ఉద్యమం నడపాలని కేసీఆర్ ప్రకటించారు. డిసెంబర్ 2వ తేదీన పార్లమెంట్లో కెసిఆర్ సాగిస్తున్న ఆమరణ నిరాహార దీక్షను అద్వానీ ప్రస్తావించారు. ఆరోగ్యం క్షీణించటంతో కెసిఆర్ ను హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. డిసెంబర్ 4వ తేదీన తెలంగాణ వస్తే జైత్రయాత్ర లేకుంటే నా శవయాత్ర అని కెసిఆర్ ప్రకటించారు. ఎంతమంది దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేసినా ససేమిరా అన్నారు కేసీఆర్. తెలంగాణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. కెసిఆర్ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది.

 ఆమరణ నిరాహార దీక్షతో క్షీణించిన కేసీఆర్ ఆరోగ్యం

ఆమరణ నిరాహార దీక్షతో క్షీణించిన కేసీఆర్ ఆరోగ్యం


కెసిఆర్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. బంద్ లు జరిగాయి. ఒక్కసారిగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఎటు చూసినా జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది. వరుస బంద్ లతో రైళ్లు, బస్సులు ఎక్కడివక్కడే స్తంభించిపోయాయి. సబ్బండ వర్ణాలు ఒక్కటయ్యాయి. వీరు వారు అన్న తేడా లేకుండా వృద్ధుల నుండి చిన్నపిల్లాడి వరకు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరు బాట పట్టారు. నాడు సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర గతిని మార్చింది.

తెలంగాణా ఏర్పాటుకు ఉవ్వెత్తున సాగిన ఉద్యమం .. తలొంచిన కేంద్రం

తెలంగాణా ఏర్పాటుకు ఉవ్వెత్తున సాగిన ఉద్యమం .. తలొంచిన కేంద్రం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్ర ప్రజల నుండి ఉద్యమం, మరోవైపు కెసిఆర్ ఆమరణ దీక్ష ద్వారా ఒత్తిడి కొనసాగుతున్న సమయంలో నాటి పాలకులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించక తప్పలేదు. డిసెంబర్ 7వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపాయి. డిసెంబర్ 8వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ కోర్ కమిటీ ఐదుసార్లు సమావేశమైంది. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా సోనియాగాంధీ సూచన మేరకు నాటి కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం ప్రకటన చేశారు. నాటి తెలంగాణా పోరాటం కేంద్రాన్ని తలొంచేలా చేసింది.

Recommended Video

Telangana : జాతీయ రాజకీయాల్లో CM KCR అడుగులు.. Mamata Banerjee తో భేటీ! || Oneindia Telugu
 కేసీఆర్ దీక్షా దివస్ ... తెలంగాణా ఉద్యమంలో చరిత్ర లిఖించిన రోజు

కేసీఆర్ దీక్షా దివస్ ... తెలంగాణా ఉద్యమంలో చరిత్ర లిఖించిన రోజు

పదకొండు రోజుల సుదీర్ఘ దీక్షతో తెలంగాణను ఏకతాటి మీదకు తీసుకువచ్చిన కేసీఆర్ చేసిన నిరాహార దీక్ష చరిత్రపుటల్లో నిలిచిపోయింది. దీక్షా దివస్ తెలంగాణా సాధనకు కేంద్ర బిందువుగా మారింది. తెలంగాణా ఉద్యమంలో చరిత్ర లిఖించిన రోజు కెసిఆర్ దీక్షా దివస్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఊతమయ్యింది. 60 ఏళ్ల స్వరాష్ట్ర ఉద్యమాన్ని లక్ష్యసాధన దిశగా తీసుకువెళ్ళింది. బంగారు తెలంగాణ సాకారానికి కారణమయ్యింది.

English summary
November 29, 2009 KCR went on a death hunger strike for separate Telangana state. It was a turning point in the history of Telangana. It was a day that ignited the special aspiration of Telangana among the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X