హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చాలా బాధేసింది, అసలు ఆయన ఏం చెప్పుకుంటారు: కేసీఆర్ నిర్ణయంపై లోకేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలంగాణలో తొలి ప్రభుత్వమే రద్దు కావడం బాధేసిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ శుక్రవారం అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ఆయన సీనియర్ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

నీ పక్కనే ఉన్నారు, ఆంధ్రా ఓటర్లు లేకుండానే గెలిచారా?: కేసీఆర్‌పై లోకేష్నీ పక్కనే ఉన్నారు, ఆంధ్రా ఓటర్లు లేకుండానే గెలిచారా?: కేసీఆర్‌పై లోకేష్

కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో కౌలు రైతులకు ఏమాత్రం లబ్ధి చేకూరలేదన్నారు. బీజేపీతో కలవనని కేసీఆర్ చెబుతున్నారు కానీ, కమలం పార్టీ స్క్రిప్ట్ ప్రకారమే తెరాస అధినేత నడుస్తున్నట్లుగా కనిపిస్తోందని చెప్పారు. అక్రమ సంబంధానికి గోత్రాలు ఏమిటన్నారు.

ఏపీకి వ్యతిరేకంగా ఉన్న కేంద్రానికి తెరాస సహకారం

ఏపీకి వ్యతిరేకంగా ఉన్న కేంద్రానికి తెరాస సహకారం

ప్రీపోల్ అలయెన్స్ పెట్టుకున్న తెలుగుదేశం పార్టీకి, ఏపీకి ఏం చేయని కేంద్ర ప్రభుత్వం తెరాస ప్రభుత్వానికి మాత్రం సహకారం అందించిందని నారా లోకేష్ అన్నారు. జోనల్ వ్యవస్థకు మూడు రోజుల్లో గెజిట్ ఇచ్చారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నవ్యాంధ్రకు వ్యతిరేకంగా తెరాస కేంద్రానికి సహకరించిందని ఆరోపించారు.

Recommended Video

కేసీఆర్ దూకుడు కళ్ళెం వేయనున్న కాంగ్రెస్....!
అసలు కేసీఆర్ ఏం చెప్పుకుంటారు?

అసలు కేసీఆర్ ఏం చెప్పుకుంటారు?

తన ఎమ్మెల్యే ఇతనే అని ప్రజలు గుర్తుపెట్టుకోవడం తప్ప తెరాస ప్రచారంతో ఒరిగిందేమీ లేదని నారా లోకేష్ విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తే కేసీఆర్ ఏం చెప్పుకుంటారని ప్రశ్నించారు. తెరాస ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తుందోనని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ అర్థం లేని హడావుడి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు.

కేసీఆర్ ఐటీ కంపెనీలు తెచ్చారా?

కేసీఆర్ ఐటీ కంపెనీలు తెచ్చారా?

ఈ నాలుగున్నరేళ్లలో పలానా పని చేశామని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకోవడానికి ఏమీ లేదని నారా లోకేష్ అన్నారు. ఐటీ కంపెనీలు తెచ్చామని, పరిశ్రమలు తీసుకు వచ్చామని చెప్పుకోగలరా, అవి వచ్చిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అభ్యర్థులను ప్రకటించి కూడా తప్పు చేశారన్నారు.

 జగన్‌పైనా లోకేష్

జగన్‌పైనా లోకేష్

అవినీతిపరుల ఆస్తులను జఫ్తు చేయాలన్న బిల్లు కేంద్రానికి పంపిస్తే మోక్షమే లేదని నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిపరుడైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్నారని ఆరోపించారు.

English summary
TDP General Secretary Nara Lokesh said that the TRS President and Telangana Chief Minister K Chandrasekhar Rao did a blunder by announcing candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X