వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందులో..కేసీఆర్ ఫాలోస్ జగన్ : అమలుకు ఎన్వోసీ కోరిన తెలంగాణ: సిద్దమేనన్న ఏపీ సీఎం..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

ఏపీలో ముఖ్యమంత్రి అమలు చేస్తున్న ఒక కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆకర్షించింది. దీంతో..ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆ కార్యక్రమం అమలుకు ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత నాడు -నేడు పధకాన్ని ప్రకటించారు. దీని కింద ఏపీలోని 45 వేళ ప్రభుత్వ పాఠశాలలు..కాలేజీలతో పాటుగా అంగన్ వాడీ కేంద్రాలు..ఆస్పుత్రులను నేటి అవసరాలకు అనుగుణం గా తీర్చి దిద్దటం ఈ కార్యక్రమం లక్ష్యం. ఇందు కోసం ఇప్పటికే తొలి విడత లక్ష్యాల్లో భాగంగా భారీగా నిధులు కేటాయించారు. అదే సమయంలో..ఎక్కడా ఈ కార్యక్రమంలో అనుమానాలకు.. అవినీతికి తావు లేకుండా ..పారదర్శకంగా నిర్వహించాలని నిర్ణయించారు.

 జగన్ నాడు-నేడు..

జగన్ నాడు-నేడు..

దీని కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ కార్యక్రమంలో నిర్ణయించిన లక్ష్యాలు..అమలు..చేస్తున్న పనులు..పూర్తయిన పనులతో పాటుగా నిధుల ఖర్చు ఏ మేర చేసారనే దాని పైన ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసారు. దీని నిర్వహణా బాధ్యతలను టీసీఎస్ సంస్థకు అప్పగించారు. అయితే, ఇప్పుడు ఇదే అంశం పైన తమకు ఈ సాప్ట్ వేర్ ను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం టీసీఎస్ ను కోరింది. అందుకు తాము ఏపీ ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకొని...దానిని అమలు చేస్తున్నామని...ఇవ్వాలంటే ఏపీ ప్రభుత్వం అనుమతి కావాలని స్పష్టం చేసింది.

 తెలంగాణలో అమలు కోసం..

తెలంగాణలో అమలు కోసం..

దీంతో..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌ సుల్తానియా ఏపీ విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌కు ఒక లేఖ రాసారు. అందులో తమ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరచడం కోసం ఏపీ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకొనేందుకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) ఇవ్వాలని కోరారు. దీని ద్వారా తమ రాష్ట్రంలోనూ ఏపీ తరహాలోనే నాడు - నేడు అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ తాజాగా జరిగిన విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ కు ఈ లేఖ గురించి వివరించారు.

 సీఎం జగన్ అంగీకారం

సీఎం జగన్ అంగీకారం

తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చిన లేఖను పరిశీలించారు. వెంటనే సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. తెలుగు ప్రజలకు ప్రయోజనం చేకూరేందుకు అవసరమైన సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వెంటనే తెలంగాణ అధికారులు అడిగిన విధంగా నిరంభ్యతర సర్టిఫికెట్(ఎన్వోసీ) ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇప్పుడు ఇది ఏపీ ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఏపీలో అమలు చేస్తున్న వార్డు సచివాలయాల గురించి అనేక రాష్ట్రాలు ఆసక్తి చూపించాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం ఒక దశలో వార్డు వాలంటీర్లు ఏర్పాటు అంశాన్ని పరిశీలన చేసింది.

English summary
impressed with AP govt Nadu-Nedu programme, Telangana govt expressed interest to implement in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X