కెసిఆర్‌కు 17 సెప్టెంబర్ చిక్కులు: మజ్లీస్ దోస్తీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు సెప్టెంబర్ 17 చిక్కులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సెప్టెంబర్ 17వ తేదీని ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా, తెలంగాణ ఉద్యమ కాలంలో ఊరూరా సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడిగా కెసిఆర్ పిలుపునిచ్చారు.
మజ్లీస్‌తో దోస్తీ కారణంగా ఆయన సెప్టెంబర్ 17వ తేదీన ప్రభుత్వపరంగా నిర్వహించగలరా, లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 1948 డిసెంబర్ 17వ తేదీన నిజాం ఇండియన్ యూనియన్‌కు లొంగిపోయారు. దీంతో ఆ రోజును బిజెపి తెలంగాణ విమోచన దినంగా పాటించాలని డిమాండ్ చేస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రలో కలిసిన అప్పటి హైదరాబాద్ రాజ్యంలోని జిల్లాల్లో ఆ ప్రభుత్వాలు అధికారికంగా సెప్టెంబర్ 17వ తేదీని నిర్వహిస్తున్నాయి.

మజ్లీస్ మాత్రం సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ వస్తోంది. అయితే, తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు సెప్టెంబర్ 17వ తేదీన పార్టీల పరంగా నిర్వహించాయి. కానీ, అధికారికంగా నిర్వహించడానికి ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అంగీకరించలేదు.
యూనియన్ ప్రభుత్వం దాడి చేసి, బలవంతంగా హైదరాబాదును భారత్‌లో కలుపుకుందని అభిప్రాయం మజ్లీస్‌కు ఉంది. అదే సమయంలో తెలంగాణలోని విప్లవ శక్తులు కూడా తెలంగాణ విమోచన అనే పదాన్ని అంగీకరించడం లేదు. ఈ స్థితిలో సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా నిర్వహించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకు వస్తారా, లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications