వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి సాధించిన కెసిఆర్ గ్రేట్: అజిత్ సింగ్, రేపు 'వార్' రూం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రతికూల పరిస్థితుల్లో కూడా తెలంగాణ సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అభినందనీయులు అని రాష్ట్రీయ లోక దళ్ (ఆర్ఎల్డీ) అధ్యక్షులు అజిత్ సింగ్ సోమవారం అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు కూడగట్టడంలో భాగంగా కెసిఆర్ సోమవారం మధ్యాహ్నం అజిత్ సింగ్‌ను కలిశారు.

అనంతరం అజిత్ సింగ్ విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు తాము మద్దతిస్తామని చెప్పారు. త్వరలో తెలంగాణ సాకారం అవనుందన్నారు. ఉత్తర ప్రదేశ్‌ను కూడా నాలుగు రాష్ట్రాలుగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణ సాధించుకున్నారన్నారు.

KCR to meet Manmohan Singh on Telangana issue tomorrow

తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో మద్దతిస్తామని భారతీయ జనతా పార్టీ లోకసభ పక్ష నేత సుష్మా స్వరాజ్ స్పష్టంగా చెప్పారని కెసిఆర్ మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ బిల్లు పైన పార్లమెంటులో చిన్న చిన్న అవరోధాలు ఎదురైనప్పటికీ తాము అధిగమిస్తామన్నారు. ఆర్ఎల్డీ మొదటి నుండి తెలంగాణకు కట్టుబడి ఉందన్నారు. పార్లమెంటులో బిల్లు కచ్చితంగా ఆమోదం పొంది తీరుతుందన్నారు. కాగా, కెసిఆర్ మంగళవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను తెలంగాణ అంశంపై కలువనున్నారు.

వార్ రూంలో సమావేశం

మంగళవారం రాత్రి ఏడు గంటలకు వార్ రంలో సమావేశానికి రావాలని సీమాంధ్ర ప్రాంత ఎంపీలకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆహ్వానించింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా పిలుపు వచ్చింది. వార్ రూంలో తెలంగాణ అంశంపై మాట్లాడనున్నారు.

English summary
Telangana Rashtra Samiti (TRS) chief K Chandrasekhar Rao reached here on Friday along with party leaders to mobilise support for the AP Reorganisation Bill (Telangana Bill) in Parliament during the Winter Session beginning on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X