వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడుపేందుకు:'సార్' జయంతి వేడుకలో కెసిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ పేరును జయశంకర్ యూనివర్సిటీగా మార్చితే ఏడుపు ఎందుకు అని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. బుధవారం వ్యవసాయ వర్సిటీలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సభలో కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వర్సిటీ పేరును జయశంకర్ వర్సిటీగా మార్చినట్లు సిఎం కెసిఆర్ అధికారికంగా ప్రకటించారు.

రైతుల కష్టాలు చూసి కన్నీరు పెట్టిన జయశంకర్ పేరు పెట్టడమే సమంజసమని కెసిఆర్ అన్నారు. యూనివర్సిటీ పేరుపై ఆంధ్రా నాయకులు ఎందుకు కుల్లుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. మా తెలంగాణ మాకు వచ్చిందని ఇకపై మా బతుకు మాది మీ బతుకు మీది అని అన్నారు. ప్రతీ దాన్ని సమస్య చేయడం సరికాదన్నారు.

తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజులు కడతామని కెసిఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఏపీలో లక్షల కోట్లు పెట్టి రాజధాని కడుతామన్నారు కానీ మీ పిల్లలకు ఫీజులు కట్టుకోలేరా అని ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో తమతో పోటీ పడాలన్నారు. విద్యుత్ కొరతను మూడేళ్లలో అధిగమించి రైతులకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తామని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా వర్సిటీలో ‘మన ఊరు-మన కూరగాయలు' పథకాన్ని కెసిఆర్ ప్రారంభించారు. అలాగే రీసెర్చ్ కాంప్లెక్స్, ఎగ్జామినేషన్ భవనాలకు శంకుస్థాపన చేసిన కెసిఆర్ ఉమెన్స్ హాస్టల్‌లో ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు. అనంతరం ఉద్యాన వర్సిటీలో స్టాళ్లను కేసీఆర్ సందర్శించారు.

కెసిఆర్

కెసిఆర్

ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ పేరును జయశంకర్ యూనివర్సిటీగా మార్చితే ఏడుపు ఎందుకు అని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య ఎన్జీరంగా పేరు మార్చి జయశంకర్ పేరును పెడుతూ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి పైలాన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

కెసిఆర్

కెసిఆర్

బుధవారం వ్యవసాయ వర్సిటీలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సభలో కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు.

కెసిఆర్

కెసిఆర్

రైతుల కష్టాలు చూసి కన్నీరు పెట్టిన జయశంకర్ పేరు పెట్టడమే సమంజసమని కెసిఆర్ అన్నారు. యూనివర్సిటీ పేరుపై ఆంధ్రా నాయకులు ఎందుకు కుల్లుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.

కెసిఆర్

కెసిఆర్

గ్రీన్‌హౌజ్ రైతులకు రుణమాఫీ వర్తింప చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. వ్యవసాయ యూనివర్సిటీలో ఆధునిక పరిశోధనలు జరగాలని సూచించారు.

కెసిఆర్

కెసిఆర్

విత్తనాల ఉత్పత్తిపై ప్రభుత్వం అధికంగా దృష్టి సారిస్తుందని, భవిష్యత్‌లో సీడ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

కెసిఆర్

కెసిఆర్

త్వరలో వ్యవసాయ యూనివర్సిటీకి వీసీని నియమిస్తామని కావాల్సిన నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు

కెసిఆర్

కెసిఆర్

రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కెసిఆర్ బుధవారం ఆవిష్కరించారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ సందర్భంగా వర్సిటీలో ‘మన ఊరు-మన కూరగాయలు' పథకాన్ని కెసిఆర్ ప్రారంభించారు.

కెసిఆర్

కెసిఆర్

అలాగే రీసెర్చ్ కాంప్లెక్స్, ఎగ్జామినేషన్ భవనాలకు శంకుస్థాపన చేసిన కెసిఆర్ ఉమెన్స్ హాస్టల్‌లో ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు.

జయంతి వేడుకలు

జయంతి వేడుకలు

ప్రొఫెసర్ జయశంకర్ వేడుకలను నగరంలోని ఆర్టీఏ కార్యాలయంలో అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

జయంతి వేడుకలు

జయంతి వేడుకలు

ప్రొఫెసర్ జయశంకర్ వేడుకలను నగరంలోని ఆర్టీఏ కార్యాలయంలో అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

English summary
As promised earlier, Telangana chief minister K.Chandrasekhar Rao officially named the agriculture university at Rajendranagar here after one of the key figures of Telangana Movement, the late Prof K.Jayashankar on his 81st birth anniversary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X