వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్గొండలో భారీ విద్యుత్ కేంద్రం: అందుకే కేసీఆర్ నిర్ణయం! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం దిలావపూర్, పీర్లపాలెం గ్రామాల్లో 7,600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నల్గొండ జిల్లాలో భారీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.

కృష్ణా పరివాహక ప్రాంతం, బొగ్గు దిగుమతికి సమీప ప్రాంతాల్లో అవకాశాలు ఉండటం, రవాణా సౌకర్యం, వేల ఎకరాల ప్రభుత్వ భూమి సిద్ధంగా ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని తెలుస్తోంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ మంగళవారం నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం పరిసరాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

ఉదయం 12.45 గంటలకు మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డిలతో కలిసి పర్యటన ప్రాంతానికి చేరుకున్నారు. మరో హెలికాప్టర్‌లో జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు, సీఎం కార్యదర్మి నర్సింగ రావు, స్మితా సభర్వాల్‌తో నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్నారు.

 పవర్ ప్లాంట్

పవర్ ప్లాంట్

స్థానికంగా అటవీశాఖ అధికారులు భౌగోళిక వివరాల ఛాయా చిత్రాలతో వారికి ఆ ప్రాంతం పట్ల అవగాహన కల్పించారు. మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 1.55 గంటల వరకు అనువైన భూములు, జలవనరుల విశేషాలు, సాధ్యాసాధ్యాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

 పవర్ ప్లాంట్

పవర్ ప్లాంట్

సర్వే అనంతరం వీర్లపాలెం గ్రామపరిధిలో ఏర్పాటుచేసిన శిబిరంలో అఽధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో పాల్గొన్న ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ సమీక్ష వివరాలను కొన్నింటిని వెల్లడించారు.

 పవర్ ప్లాంట్

పవర్ ప్లాంట్

ఆ వివరాల మేరకు రూ.50వేల కోట్ల పెట్టుబడితో దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ పరిసరాల్లో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

 పవర్ ప్లాంట్

పవర్ ప్లాంట్

కృష్ణపట్నం ఓడరేవు వీర్లపాలెం నుంచి సుమారు 180 కిలోమీటర్లు, బందరు పోర్టు 130 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో విదేశాల నుంచి బొగ్గు దిగుమతికి ఇబ్బందులు ఉండవనేది సీఎం తన సమీక్షలో తేల్చారు.

 పవర్ ప్లాంట్

పవర్ ప్లాంట్

కృష్ణానదికి నాలుగు కిలోమీటర్ల దూరం, పక్కనే సికింద్రాబాద్‌-నడికుడి రైల్వేమార్గం, కూతవేటు దూరంలోనే నార్కట్‌పల్లి - అద్దంకి హైవే ఉండటం ఈ ప్రాజెక్టుకు సానుకూల అంశాలుగా నిర్ధారించారు. మెగావాట్‌ విద్యుత్‌కు రూ.6 కోట్లు ఖర్చవుతుందని లెక్కవేసి, విద్యుత్‌ ప్లాంట్లకు సుమారు రూ.45,500 కోట్ల వ్యయం అంచనా వేశారు.

 పవర్ ప్లాంట్

పవర్ ప్లాంట్

మరో రూ.5,000 కోట్లతో ఉద్యోగులకు టౌన్‌షిప్‌, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పవర్‌ ప్రాజెక్టుకు 7,600 ఎకరాలు అవసరం కాగా వీర్లపాలెం పరిసరాల్లో అంతకు రెట్టింపు అటవీశాఖ భూమి ఉంది. అటవీ శాఖకు భూమికి భూమి పరిహారం ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.

 పవర్ ప్లాంట్

పవర్ ప్లాంట్

ఇప్పుడు గుర్తించిన ప్రాంతంలో ఈ నెల 26నుంచే సర్వే పనులు ప్రారంభించాలని కలెక్టర్‌ చిరంజీవులుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, రూరల్‌ ఎలక్ర్టికల్‌ కార్పొరేషన్‌ల మధ్య చర్చలు సైతం పూర్తయినట్టు బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.

పవర్ ప్లాంట్

పవర్ ప్లాంట్

వీర్లపాలెం పరిసరాల్లో సీఎం ఏరియల్‌ సర్వే నిర్వహించగా జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు, సీఎం ప్రత్యేక కార్యదర్మి నర్సింగరావులు జిల్లాలోని మఠంపల్లి మండల పరిసరాల్లోనూ విద్యుత్‌ కేంద్రానికి అవసరమైన భూములు, జల వనరులపై సర్వే నిర్వహించారు.

English summary
The Telangana government has decided to set up a 7,600 MW thermal power station at Peerlapalem and Dilavarpur in Damarcherla mandal of Nalgonda district. The station will be set up jointly by Telangana Genco and NTPUC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X