తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలలో కేసీఆర్‌కు ఘన స్వాగతం, కొండపై కలిసిన వైసిపి నేతలు

తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానుకలు సమర్పిస్తానని మొక్కుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ముఖ్యమంత్రి హోదాలో మంగళవారం తొలిసారి తిరుమల చేరుకున్నారు.

|
Google Oneindia TeluguNews

తిరుమల: తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానుకలు సమర్పిస్తానని మొక్కుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ముఖ్యమంత్రి హోదాలో మంగళవారం తొలిసారి తిరుమల చేరుకున్నారు. ఆయన బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శనం చేసుకోనున్నారు.

<strong>తెలుగు రాష్ట్రాలు గొప్పగా, శ్రీవారికి ప్రాంతాలుండవు: తిరుమలలో కేసీఆర్(పిక్చర్స్)</strong>తెలుగు రాష్ట్రాలు గొప్పగా, శ్రీవారికి ప్రాంతాలుండవు: తిరుమలలో కేసీఆర్(పిక్చర్స్)

కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, ఎమ్మెల్యేలు సుగుణమ్మ, చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఘన స్వాగతం పలికారు.

K Chandrasekhar Rao

అనంతరం కేసీఆర్‌ రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. రేపు ఉదయం కేసీఆర్‌ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. కాగా, కేసీఆర్ తిరుమల పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్‌కు తిరుమల కొండ పైన టిటిడి ఈవో, చైర్మన్, పాలక మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు.

కేసీఆర్‌ను కలిసిన వైసిపి నేతలు

తిరుమల చేరుకున్న కేసీఆర్‌ను వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిలు కలిశారు.

కాగా, కేసీఆర్ కంటేముందే తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.

శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, మంత్రులు ఈటెల రాజేందర్‌, హరీష్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్‌ ఎస్పీసింగ్‌, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ తదితరులు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి విమానాశ్రయ అధికారులు స్వాగతం పలికారు.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao on Tuesday evening reached Tirumala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X