హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌పై కేఈ ఘాటుగా, సెక్షన్ 8 అమల్లో ఉందని జగన్ పార్టీ కొత్త ట్విస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

కర్నూలు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బుధవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇంకా ఉద్యమ నేతగానే వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. సెక్షన్ 8 అమలు చేస్తే దీక్ష చేస్తానని హెచ్చరించడం సరికాదని హితవు పలికారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడటం విడ్డూరమన్నారు. విభజన చట్టం ప్రకారమే ఉమ్మడి రాష్ట్రం విడిపోయిందని గుర్తు చేశారు. సెక్షన్ 8 చెల్లదని ఎలా చెబుతారని తెరాసను ప్రశ్నించారు.

ఓటుకు నోటు కేసును సీబీఐతో దర్యాఫ్తు జరిపించండి: రఘువీరా

KCR statement is not correct: KE Krishnamurthy

ఓటుకు నోటు కేసును సీబీఐతో దర్యాఫ్తు జరిపించాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి బుధవారం లేఖ రాశారు.

రౌండ్ టేబుల్ సమావేశం గందరగోళం

సెక్షన్ 8 అమలు పైన ఏపీ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో విశాఖలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం గందరగోళానికి దారి తీసింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చివరి వరకు ఉద్యమంలో పాల్గొన్న తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యమాన్ని మధ్యలోనే వదిలి వెళ్లిన ఏపీఎన్జీవోలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ఫిట్మెంట్ కోసం పాకులాడారని పలువురు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు రాగానే సెక్షన్ 8 గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.

వైసీపీ కొత్త ట్విస్ట్

వైసీపీ ఎమ్మెల్యే రాజేంద్ర కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం సెక్షన్ 8 అమలులోనే ఉందని చెప్పారు. ఓటుకు నోటు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు సెక్షన్ 8ను తెరపైకి తీసుకు వచ్చారని విమర్శించారు. అవసరం లేని
అంశాలతో టీడీపీ పబ్బం గడుపుతోందన్నారు.

English summary
KCR statement is not correct: KE Krishnamurthy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X