వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు జ్వరం, భేటీలు రద్దు: రేపు ఢిల్లీకి చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో బుధవారం ఉన్న అపాయింట్‌మెంట్లన్నీ రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

మంగళవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కెసిఆర్‌ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు నివాసానికి చేరుకున్నారు. అయితే కెసిఆర్ జ్వరంతో బాధపడుతుండటంతో వారంతా నిరాశతో వెను దిరుగుతున్నారు.

 KCR suffers from fever

ఇదిలావుంటే, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రేపు (గురువారం) ఢిల్లీ వెళ్లనున్నారు. జూన్ 2వ తేదీ వరకు బాబు ఢిల్లీలోనే గడుపనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు, ఐఐఎం, ఐఐటి, విద్యుత్, పోలవరం ప్రాజెక్ట్ తదితర అంశాలపై వివిధ శాఖల మంత్రులతో చంద్రబాబు సమావేశంకానున్నారు.

తెలంగాణ గవర్నర్ బాధ్యతలు నరసింహన్‌కు..

కాగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖర రావు జూన్ 2వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్‌కు అప్పగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత బాధ్యతలతో పాటు ఆయన తెలంగాణ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించనున్నారు.

English summary

 It is said that Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao is suffering from fever. Meanwhile, The President of India has appointed Shri E.S.L. Narasimhan, Governor of Andhra Pradesh, to discharge the functions of the Governor of Telangana, in addition to his own duties until a permanent arrangement is made.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X