తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘శంకర్ ఎలా ఉన్నావ్’: రేణిగుంటలో బాల్యమిత్రుడితో కేసీఆర్ ఆసక్తికరం

తిరుమల శ్రీవారికి మొక్కులు తీర్చుకోవడానికై మంగళవారం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన బాల్యమిత్రుడు కందాటి శంకర్ రెడ్డిని చూసి ఆగారు.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తిరుమల శ్రీవారికి మొక్కులు తీర్చుకోవడానికై మంగళవారం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన బాల్యమిత్రుడు కందాటి శంకర్ రెడ్డిని చూసి ఆగారు. ఆ తర్వాత 'శంకర్ ఎలా ఉన్నావ్' అంటూ ఆప్యాయంగా పలుకరించారు.

కేసీఆర్ కోసం ఏపీ భారీ ఏర్పాట్లు: శ్రీవారికిచ్చే కానుకలివే(పిక్చర్స్)కేసీఆర్ కోసం ఏపీ భారీ ఏర్పాట్లు: శ్రీవారికిచ్చే కానుకలివే(పిక్చర్స్)

విమనాశ్రయంలో దిగిన అనంతరం ఎవరినీ కలవకుండా నేరుగా వెళ్ళాలని అనుకున్న కేసిఆర్.. నిలబడి కందాటితో ఆప్యాయంగా మాట్లాడటం అందరిని విస్మయానికి గురిచేసింది. అయితే, మరో విశేషం కూడా ఇక్కడ ఉంది. అదేమంటే.. శంకర్ రెడ్డి సుమారు 3వేల మందితో కేసీఆర్‌కు స్వాగతం పలకడానికి విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు.

kcr talks with his childhood friend in Renigunta

అయితే భద్రతా కారణాల దృష్ట్యా సుమారు రెండు వేల మందిని విమానాశ్రయానికి వెళ్ళే మార్గంలోనే ఆపేశారు. మరో 800 మంది మహిళలను పాతవిమానాశ్రయం వద్దే నిలిపేశారు. దీంతో, శంకర్ రెడ్డి మాత్రం విమానాశ్రయం వెలుపలే నిలబడి వేచివున్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్.. శంకర్ రెడ్డితో కొంతసేపు మాట్లాడారు., శంకర్ రెడ్డిని కుశలప్రశ్నలు వేశారు. ఆయనతో మాటలు కలిపి నిలబడటం చూసిన తెలంగాణ మంత్రులు, అధికారులు, అక్కడున్న వారు సైతం ఆశ్చర్యపోయారు. శంకర్ రెడ్డి వెంటవున్న కాంగ్రెస్ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవిని కూడా ఆయన ఆప్యాయంగా పలుకరించడం విశేషం.

English summary
Telangana CM k chandrasekhar Rao on Tuesday talked with his childhood friend in Renigunta airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X