వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీకు ఆ రెండు ప‌త్రిక‌లు బాకా..వైయ‌స్ త‌ర‌హాలో కేసీఆర్..అస‌లు ల‌క్ష్యం అదేనా..!

|
Google Oneindia TeluguNews

నీవు ద‌ద్ద‌మ్మ‌వి..నీకు ఆత్మి విశ్వాసం లేదు. నీవు లీడ‌ర్ వి కాదు. నీ మామ పెట్టిన పార్టీని లాక్కున్నావ్‌. నీవు మేనేజ‌ర్ వి. నీకు ఆ రెండు ప‌త్రిక‌లు బాకా ఊదుతాయి...అంటూ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఇప్పు డు ఏపి - తెలంగాణ ల్లో చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యాయి. కేసీఆర్ త‌న స‌హ‌జ శైలిలో చంద్ర‌బాబు తో పాటుగా ఆ రెండు ప‌త్రికలు అంటూ చేస్తున్న వ్యాఖ్య‌లు..నాటి వైయ‌స్ వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేస్తున్నాయి..అయితే అస‌లు ల‌క్ష్యం ఏంట‌నేదే చ‌ర్చ‌...

ఆ రెండు ప‌త్రిక‌లు అంటూ ఫైర్‌..

ఆ రెండు ప‌త్రిక‌లు అంటూ ఫైర్‌..

కేసీఆర్ నిర్వ‌హించిన మీడియా సమావేశంలో ఆ రెండు ప‌త్రిక‌లు అంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. తెలంగాణ ఎన్నిక ల స‌మ‌యంలోనూ కొన్ని ప‌త్రిక‌లు..ఛాన‌ళ్లు టిడిపి-కాంగ్రెస్ కూట‌మి కి లేని బ‌లాన్ని అపాదించి రాస్తున్నాయ‌ని టిఆర్ య‌స్ నేత‌లు విమ‌ర్శించారు. ల‌గ‌డ‌పాటి స‌ర్వే స‌మ‌యంలోనూ కెసిఆర్‌..కెటిఆర్ లు ఇద్ద‌రూ టిడిపికి మ‌ద్ద‌తు ప‌లికే ప త్రిక‌లూ అంటూ విమ‌ర్శ‌లు చేసారు. ఇక‌, ఎన్నిక‌లు అయిపోయిన త‌రువాత కూడా ఆ ప‌త్రిక‌లూ.. అంటూ సంద‌ర్భాను సారం ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. తాజాగా, కేసీఆర్..చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తున్న సంద‌ర్భంలో ప‌త్రిక‌ల విష‌యాల ను లేవెనెత్తారు. చంద్ర‌బాబు కు ఆ రెండు ప‌త్రికలు బాకా ఊదుతున్నాయ‌ని విమ‌ర్శించారు. గ‌తంలో వైయ‌స్ సైతం ఇదే త‌ర‌హా లో ఆ రెండు ప‌త్రిక‌లు అంటూ ఈనాడు- ఆంధ్ర‌జ్యోతి చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇస్తున్నాయ‌ని విమ‌ర్శ‌లు చేసేవారు. ఆ రెండు ప‌త్రిక‌లు టిడిపి గ‌జెట్ పేప‌ర్ల‌ని ఆరోపించేవారు. ఇప్పుడు తిరిగి..చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇస్తున్నా రంటూ కేసీఆర్ సైతం ఆదే త‌ర‌హాలో ఆ రెండు ప‌త్రిక‌లు అంటూ విమ‌ర్శ‌లు చేయ‌టం కొత్త చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది.

ఇదేనా ప‌త్రిక‌ల తీరు...అస‌హ‌నం..

ఇదేనా ప‌త్రిక‌ల తీరు...అస‌హ‌నం..

తాను విశాఖ ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో రెండు ప‌త్రిక‌లు ఏ ర‌కంగా క‌వ‌రేజ్ ఇచ్చాయ‌నే దాని పై కేసీఆర్ స్పందించారు. తాను స్వ‌రూపానంద ఆహ్వానం మేర‌కు విశాఖ శార‌దా పీఠానికి వెళ్లాన‌ని..త‌న‌కు ఏయిర్ పోర్టు నుండి పీఠం వ‌ర‌కూ పెద్ద ఎత్తున ప్ర‌జా స్పంద‌న క‌నిపించింద‌ని వివ‌రించారు. అయితే, ఆ రెండు ప‌త్రిక‌ల్లో ఒక ప‌త్రిక‌లో వైసిపి నేత‌లు కేసీఆర్ కు స్వాగ‌త బ్యాన‌ర్లు క‌ట్టార‌ని...స్వాగ‌తం ప‌లికార‌ని రాసిన విష‌యాన్ని కేసీఆర్ విశ్లేషించారు. మ‌రో ప‌త్రిక లో కేసీఆర్ కు వెల‌మ సంఘం స్వాగ‌తం ప‌లికింద‌ని రాసారని...వెల‌మ సంఘీయులు అయితే వారు ఏపి ప్ర‌జ‌లు కాదా అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. ఇదేనా జ‌ర్న‌లిజం అని నిల‌దీసారు. చంద్ర‌బాబు ఏం చేసినా బాకా ఊద‌టం..చంద్ర‌బాబు చెప్పే అంశా ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌టం ఆ రెండు ప‌త్రిక‌లు చేస్తున్న ప‌ని అంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ తొలి సారి సీయం అయ్యాక అప్ప‌ట్లో ఒక ప‌త్రిక‌- రెండు ఛాన‌ళ్ల పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. కొన్ని రోజులు ప్ర‌సారాలు సైతం నిలిచి పో యాయి. తిరిగి తాజా ఎన్నిక‌ల ప్రారంభం నుండి కేసీఆర్..కేటిఆర్ ఇలా రెండు ప‌త్రిక‌లు అంటూ వ్యంగాస్థ్రాలు సంధి స్తున్నారు. దీంతో..కేసీఆర్ రాజ‌కీయ ల‌క్ష్యాల్లో ఆ రెండు ప‌త్రిక‌లు కూడా చేరాయా అనే వాద‌న మొద‌లైంది..

అస‌లు ల‌క్ష్యం అదేనా..

జాతీయ రాజ‌కీయాల్లో ఇద్ద‌రు చంద్రులు పోటీ ప‌డి రాజ‌కీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ మ‌ద్ద‌తు తో చంద్ర‌బాబు కూట మి కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో నాన్ కాంగ్రెస్ - నాన్ బిజెపి పేరుతో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా ఆ రెండు ప‌త్రిక‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయనే భావ‌న‌లో కేసీఆర్ ఉన్నారు. అదే స‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా చంద్ర‌బాబును దెబ్బ తీసి రిట‌ర్న్ గిఫ్ఠ్ ఇవ్వా ల‌నే ల‌క్ష్యం తో కేసీఆర్ క‌నిపిస్తున్నారు. దీంతో..ముందుగా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిలిచే ప‌త్రిక‌లు..చేసే ప్ర‌చారా న్ని ఎండ‌గ‌ట్ట‌టం ద్వారా..చంద్ర‌బాబును మోర‌ల్ గా దెబ్బ తీయ‌వ‌చ్చ‌నేది కేసీఆర్ వ్యూహంగా అర్దం అవుతోంది. అదే స‌మ‌యంలో..ఏపిలో సైతం ఆ రెండు ప‌త్రిక‌లు చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా ప‌ని చేస్తున్నాయ‌నేది రాజ‌కీయ ప‌రిశీల‌కుల అభిప్రాయం. దీంతో..ఆ రెండు ప‌త్రిక‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుంటే..ముందుగా టిడిపి వాయిస్ కు అంత‌గా విలువ లే కుండా చేయ‌గ‌లుగుతామ‌నే ధీమా క‌నిపిస్తోంది. దీంతో..ఇప్పుడు కేసీఆర్ సైతం ఆ రెండు ప‌త్రిక‌లు అంటూ ప్ర‌తీ సంద‌ర్భంలోనూ ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు.

English summary
KCR Target Two Telugu daily editions which supporting AP C.M Chandra Babu. KCR politically cornered those two papers on their stand on his AP tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X