హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిఆర్ఎస్ అధ్యక్షుడిగా కెసిఆర్ ఏకగ్రీవ ఎన్నిక

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కెసిఆర్‌ను ప్రతిపాదిస్తూ ఇప్పటి వరకు 6 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు.

పార్టీ అధ్యక్ష పదవికి కెసిఆర్ మినహా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం కడియం కెసిఆర్‌ను అధ్యక్షుడిగా ప్రతిపాదించారని తెలిపారు. కడియం శ్రీహరి ప్రతిపాదనను ఆరుగురు మంత్రులు బలపరిచారని పేర్కొన్నారు.

KCR unanimously elected as TRS Chief

గ్రేటర్ టిఆర్‌ఎస్ అధ్యక్షుడిగా మైనంపల్లి

టిఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మైనంపల్లి హనుమంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టిఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో ఆయనను టిఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ విభాగం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

మైనంపల్లి పేరును డిప్యూటీ సిఎం మహమూద్ ఆలీ ప్రతిపాదించారు. మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావు బలపర్చారు. మంత్రి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఎన్నికల నిర్వహణ కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Monday unanimously elected as Telangana Rashtra Samithi president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X