వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎర్రకోటలో లెక్క: గోల్కొండ కోటలో కెసిఆర్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను చారిత్రాత్మక గోల్కొండ కోట ప్రధాన ద్వారం ఎదుట నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సోమవారం ప్రకటించారు. ఇకనుంచి స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను గోల్కొండ కోటలోనే నిర్వహించుకునేలా శాశ్వత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

సోమవారం సాయంత్రం మంత్రి జగదీశ్‌రెడ్డి, స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డిజిపి అనురాగ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, నగర మేయర్ మాజిద్ హుస్సెన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎంకె మీనా, ప్రభుత్వ సలహాదారు పాపారావుతో కలిసి ముఖ్యమంత్రి గొల్కొండ కోటను సందర్శించారు.

ఇలా ఉండగా పోలీసు కవాతు, శకటాల ప్రదర్శనకు విశాల ప్రాంతం అవసరం ఉండటంతో కోట పక్కనున్న 18 చీడిలను గణతంత్ర దినోత్సవం నాటికి చదునుచేసి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కెసిఆర్ రాక సందర్బంగా...

కెసిఆర్ రాక సందర్బంగా...

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గోల్కొండ కోటకు వచ్చారు. కెసిఆర్ రావడానికి ముందు ఇలా..

రెండు గంటల పాటు..

రెండు గంటల పాటు..

దాదాపు రెండుగంటల పాటు అధికారులతో కలిసి కోటను సందర్శించి స్వాతంత్య్ర వేడుకలలో ఏది ఎక్కడ నిర్వహించాలన్న దానిపై కెసిఆర్ మార్గనిర్దేశం చేశారు.

పుస్తకావిష్కరణ ఇలా..

పుస్తకావిష్కరణ ఇలా..

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు స్థలాన్ని పరిశీలించిన అనంతరం గోల్కొండ ద్వారం బ్యాక్ డ్రాప్‌గా ఉండేలా కోట లోపల బాలా-ఈ-హిస్సార్ కింది భాగంలో పతాకావిష్కరణకు అనువైన స్థలంగా ముఖ్యమంత్రి ఎంపిక చేశారు.

తారామతి బురుజు ఎదురుగా..

తారామతి బురుజు ఎదురుగా..

తారామతి మజీద్ ఎదురుగా ఉన్న విశాలమైన పచ్చిక బయలులో ఆహ్వానితులు కూర్చోవడానికి అనువుగా ఉంటుందని నిర్ణయించారు.

కళారూపాల ప్రదర్శన

కళారూపాల ప్రదర్శన

పతాకావిష్కరణ చేసే చుట్టుపక్కల బురుజులు, ఎతైన కట్టడాలపై నుంచి తెలంగాణ కళారూపాలు ప్రదర్శించాలని ముఖ్యమంత్రి సూచించారు.

గౌరవ వందనం ఇక్కడ...

గౌరవ వందనం ఇక్కడ...

పోలీస్ గౌరవ వందనాన్ని కూడా అక్కడే స్వీకరించనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు చెప్పారు

చారిత్రక పునర్వికాసం

చారిత్రక పునర్వికాసం

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించాలనే నిర్ణయం తెలంగాణ చారిత్రక పునర్వికాసానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఎర్రకోటలో మాదిరిగా..

ఎర్రకోటలో మాదిరిగా..

ఢిల్లీలోని ఎర్రకోట తరహాలోనే గోల్కొండ కోట వద్ద పంద్రాగస్టు వద్ద నిర్వహించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు.

సంస్కృతికి ప్రతిబింబం

సంస్కృతికి ప్రతిబింబం

తొలిసారి గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకలు జరుగునుండటంతో ప్రపంచమంతా ఆసక్తిగా గమనించనుండటంతో వీటిని ఘనంగా నిర్వహించి, తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబింపచేయాలని అధికారులకు సూచించారు.

English summary
Telangana CM K chandrasekhar Rao visited Golconda to suggest for the arrangements to celebrate independence day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X