వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముహూర్తం అదిరింది..! ప్రేమికుల దినోత్స‌వం రోజున ఏపి కి వెళ్ల‌నున్న కేసీఆర్..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Chief Minister Chandrashekhar Rao Is Going To AP | Oneindia Telugu

హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ఏ ప‌ని చేసినా రొటీన్ కి కాస్త భిన్నంగా చేస్తారు. రాజ‌కీయంగా తాను సంచ‌ల‌నం చేయాల‌ని అనుకోక పోయినా అనుకోకుండా ఆయ‌న చ‌ర్య‌లు సంచ‌ల‌నంగా మారిపోతుంటాయి. గ‌తంలో ఢిల్లీ లో ప‌ర్య‌ట‌నలు, ఏపి గురించి తాను చేసిన వ్యాఖ్య‌లు, ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గిఫ్ట్ గురించి య‌థాలాంపంగా చేసిన వ్యాఖ్య‌లు, తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఏపి ముఖ్య‌మంత్రిపై చేసిన చేసిన ఆరోప‌ణ‌లు అన్నీ రాజ‌కీయాల్లో ఎత్తుగ‌డ‌లు ఐన‌ప్ప‌టికి అవి ఎంతగానో సంచ‌ల‌నంగా మారాయి. తాజాగా వ‌చ్చే నెల 14న అంటే ఖ‌చ్చితంగా ప్రేమికుల రోజున తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ఏపి ప‌ర్య‌ట‌న ఖ‌రారు కావ‌డం ఉత్సుక‌త‌ను రేకెత్తిస్తోంది. చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ పేరుతో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంతో ప్రేమికుల రోజున చంద్ర‌శేఖ‌ర్ రావు ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర తీస్తారో అనే అంశం పై న‌రాలు తెగే ఉత్కంఠ నెల‌కొంది.

 తెలంగాణ సీయం ఏపి ప‌ర్య‌ట‌న ఖ‌రారు..! వ‌చ్చే నెల 14న విశాఖ‌కు కేసీఆర్..!!

తెలంగాణ సీయం ఏపి ప‌ర్య‌ట‌న ఖ‌రారు..! వ‌చ్చే నెల 14న విశాఖ‌కు కేసీఆర్..!!

ఉత్కంఠ‌కు తెర‌ప‌డ‌బోతోంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ఏపి ప‌ర్య‌ట‌న‌పై నెల‌కొన్న సందిగ్ద‌త‌కు తెర‌ప‌డ‌బోతోంది. గ‌త కొంత కాలంగా మాటల తూటాలు పేల్చుకున్న ఏపి, తెలంగాణ ముఖ్య‌మంత్రులు క‌లుసుకోబోతున్నారా అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు తెలంగాణ అదికార గులాబీ పార్టీకి వ్య‌తిరేంగా ప్ర‌చారం చేసి రాజ‌కీయంగా దూరాన్ని పెంచుకున్నారు. సామ‌ర‌స్యంగా ఉండాల్సిన రెండు తెలుగు రాష్ట్రాల మ‌ద్య రాజ‌కీయ వైరుద్యం నెల‌కొంది. రాజ‌కీయంగా నీఅంతు చూస్తామ‌ని ఒక‌రంటుంటే, నీఅంతే చూస్తామ‌ని మ‌రొక‌రు కాలు దువ్వే వ‌ర‌కు ప‌రిస్ధితులు వెళ్లాయి.

రాజ‌కీయంగా ఎలాంటి ప‌రిణామ‌ల‌కు దారితీస్తుంది..! కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌పై స‌ర్వత్రా ఉత్కంఠ‌..!!

రాజ‌కీయంగా ఎలాంటి ప‌రిణామ‌ల‌కు దారితీస్తుంది..! కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌పై స‌ర్వత్రా ఉత్కంఠ‌..!!

తెలంగాణ ఎన్నిక‌ల్లో జోక్యం చేసుకున్న చంద్ర‌బాబుకు ప్ర‌తిచ‌ర్య‌గా తాను కూడా ఏపి ఎన్నిక‌ల్లో జోక్యం చేసుకుంటాన‌ని ప్ర‌క‌టించి రాజ‌కీయ దేమారాన్ని లేపారు చంద్ర‌శేక‌ర్ రావు. దీంతో కొన్న రోజులుగా ఇరు రాష్ట్రాల మ‌ద్య ఉత్కంఠ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆ త‌ర్వాత ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో దేశ వ్యాప్తంగా ప‌ర్య‌టించి, జాతీయ నేత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన చంద్ర‌శేక‌ర్ రావు చివ‌రికి ఏం జ‌రిగిందో తెలియ‌దు కాని ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో మీడియా స‌మావేశం నిర్వ‌హించి చంద్ర‌బాబుపై అనుచిత వ్యాఖ్య‌లు చేసారు. దీంతో ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంతులే కాకుండా మంత్రులు సైతం జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. రెండు రాష్ట్రాల‌కు చెందిన మంత్రులు ప‌ర‌స్ప‌రం చూసుకుందాం అంటే చూసుకుందాం అనే స్థాయికి వెళ్లాయి రాజ‌కీయాలు. ఇంత‌టి వాడి వేడి ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌శేఖ‌ర్ రావు ఏపి ప‌ర్య‌ట‌న అందులోనూ ప్రేమికుల రోజున వెళ్ల‌డం మ‌రింత ఆస‌క్తి రేపుతోంది.

కేసీఆర్ విశాఖ ప‌ర్య‌ట‌న‌..! ఏపి రాజ‌కీయ‌ల్లో ఇబ్బందిక‌ర ప‌రిణామ‌లే..!!

కేసీఆర్ విశాఖ ప‌ర్య‌ట‌న‌..! ఏపి రాజ‌కీయ‌ల్లో ఇబ్బందిక‌ర ప‌రిణామ‌లే..!!

ఇక వ‌చ్చేనెల ఫిబ్ర‌వ‌రి 14న అంటే ప్ర‌పంచ ప్రేమికుల దినోత్స‌వం రోజున తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేక‌ర్ రావు ఏపిలో అడుగు పెట్ట‌బోతున్నారు. ప్రేమికుల రోజున ఏపిలో ప‌ర్య‌ట‌న ఖ‌రారు చేసుకున్న చంద్ర‌శేఖ‌ర్ రావు ఎవ‌రికి గులాబీ ఇవ్వ‌నున్నారు..? ఎవ‌రికి గులాబీ వెన‌క ఉన్న ముల్లుతో గాయం చేయ‌బోతున్నారు అనే అంశం పై ఉత్కంఠ నెల‌కొంది. చంద్ర‌శేఖ‌ర్ రావుకు ఏపి మంత్రిమండ‌లి లో కూడా అత్యంత ఆప్తులు ఉన్న సంగ‌తి తెలిసిందే..! అంతే కాకుండా అరే ఒరే అనుకునేంత సాన్నిహిత్యం ఉన్న మంత్రులు కూడా ఏపిలో చంద్ర‌శేఖ‌ర్ రావు కు ఉన్నారు. అంతే కాకుండా ఏపి ప్ర‌జ‌లు కూడా చంద్ర‌శేఖ‌ర్ రావు అంటే అభిమానం చూపిస్తుంటారు. చంద్ర‌శేఖ‌ర్ రావు ఉప‌న్యాసాల‌కు పెద్ద యెత్తున కేరింత‌లు కొడుతుంటారు.

 ఇంత‌కీ కేసీఆర్ ప‌ర్య‌ట‌న రాజ‌కీయం కోస‌మా..? ఆద్యాత్మికం కోస‌మా..?

ఇంత‌కీ కేసీఆర్ ప‌ర్య‌ట‌న రాజ‌కీయం కోస‌మా..? ఆద్యాత్మికం కోస‌మా..?

చంద్ర‌శేఖ‌ర్ రావు ఏపిలో ప‌ర్య‌టిస్తేఎలాంటి అవ‌రోధాలు ఎదుర‌వ్వ‌క‌పోయిన‌ప్ప‌టికి, సాద‌ర స్వాగ‌తాలు ల‌భించే అవ‌కాశాలే ఎక్కువాగా క‌నిపిస్తున్నాయి. మ‌రి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాజ‌కీయంగా ఎవ‌రికి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదురౌతాయ‌నే అంశంపైన మాత్ర‌మే ఉత్కంఠ నెల‌కొంది. వ‌చ్చే నెల 14 న విశాఖ‌లోని శ్రుంగేరీ ఫీఠం నిర్వ‌హించే హోమానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావుకు ఆహ్వానం అందింది. అదే ఆహ్వానం ప‌ట్ల చంద్ర‌శేఖ‌ర్ సానుకూలంగా స్పందించిన‌ట్టు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే వ‌చ్చే నెల విశాఖ శ్రుంగేర మ‌ఠంలో త‌ల‌పెట్టిన యాగానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ముఖ్య అతిదిగా హాజ‌ర‌వ్వ‌డ‌మే కాకుండా స‌తీ స‌మేతంగా విశాఖ తీరానికి చేరుకోబోతున్నార‌న్న మాట‌. ఇంత‌కీ చంద్ర‌శేఖ‌ర్ రావుది ఆద్యాత్మిక ప‌ర్య‌ట‌నా లేక రాజ‌కీయ ప‌ర్య‌ట‌నా అనేది ఆయ‌న స్వ‌యంగా మీడియాకి స్ప‌ష్టం చేయాల్సిన పిరిస్థితులు నెల‌కొన్నాయి.

English summary
On 14th of next month, on the occasion of Valentine's Day, Telangana Chief Minister Chandrashekhar Rao is going to AP. Sensitive political situations took place in ap when kcr announces return gift to ap cm chandrababu naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X