కుటిల రాజకీయలే సీమ అభివృద్ధికి అడ్డు: కెఈ, కర్నూలుకు చంద్రబాబు వరాలు
కర్నూలు: కుటిల రాజకీయాలతో కొందరు రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి ఆరోపించారు. ఆయన కర్నూలు జిల్లాలో సోమవారం పర్యటించిన సందర్భంగా మాట్లాడారు.
పనిపాటాలేని కొన్ని పార్టీల నాయకులే అనవసర ఆందోళనలకు దిగుతున్నాయని ఆయన మండిపడ్డారు. కర్నూలును పరిశ్రమల రాజధానిగా చేయాలని ఏపి సిఎం చంద్రబాబు భావిస్తున్నారని చెప్పారు. ముస్లింల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం కృషి చేస్తోందని కెఈ తెలిపారు.

కర్నూలుకు చంద్రబాబు వరాలు
కర్నూలు జిల్లాపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వరాల జల్లు కురిపించారు. సోమవారం ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరిన చంద్రబాబు కొద్దిసేపటి క్రితం కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం గోరుకల్లులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 900 ఎకరాల్లో ఎడ్యుకేషనల్ హబ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
ఉర్దూ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం వచ్చే ఏడాది ప్రత్యేక డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఉర్దూ వర్సిటీకి 125 ఎకరాల భూమిని కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ నెల నుంచి ఇమాంలకు నెలకు రూ.5 వేల వేతనం అందిస్తామని ఆయన ప్రకటించారు.












Click it and Unblock the Notifications