వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా భజన: జగన్‌పై కెఇ, హైదరాబాద్‌పై సోమిరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

 KE Krishna Murthy
కర్నూలు/ హైదరాబాద్ : తెలంగాణ ముసాయిదా బిల్లులో రాయలసీమకు జరిగిన అన్యాయంపై తాము ఉద్యమిస్తామి తెలుగుదేశం రాయలసీమ ప్రాంత నాయకుడు కెఇ కృష్ణమూర్తి చెప్పారు. కర్నూలులో ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆయన ప్రాంతాల ప్రజల మనోభావాలను సభలో వినిపించే స్వేచ్ఛను తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కల్పించినట్లు ఆయన తెలిపారు.

బిజెపితో కలిసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. హైదరాబాదులో విభజన, ఢిల్లీలో సోనియా భజనతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ తరిస్తున్నారని ఆయన అన్నారు. సమైక్య పక్షమో, సోనియా పక్షమో జగన్ స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారమే పరమావధిగా జగన్ ముందుకు వెళ్తున్నారని ఆయన విమర్శించారు. విభజన జరిగితే మూడేళ్లలో రాయలసీమ ప్రత్యేక ఉద్యమం తీవ్రంగా వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర విభజన బిల్లు తప్పులతడకగా ఉందని తెలుగుదేశం సీమాంధ్ర నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదును దేశానికి రెండో రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా అందరూ ఈ అంశంపై ముందుకు రావాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో కోరారు.

తెలంగాణ ముసాయిదా బిల్లులో ఉన్న తప్పులను ఎవరూ పట్టించునకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పార్టీల నాయకులు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ తీసుకుని, హైదరాబాద్ ప్రాముఖ్యతను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విభజన జరిగిన మరుక్షణం హైదరాబాద్‌పై ఎలాంటి చట్టపరమైన హక్కు లేకుండా పోతుందని ఆయన అన్నారు.

English summary

 The Telugudesam Rayalaseema leader KE Krishna Murthy lashed out at YSR Congress party president YS Jagan on Andhra Pradesh bifurcation issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X