వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ జాతీయ పార్టీ, కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: కేఈ, చంద్రబాబు మందలించలేదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

కర్నూలు: జిల్లాలో నిర్వహించిన ధర్మ పోరాట దీక్ష విజయవంతం అయిందని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదివారం అన్నారు. దీక్షకు వచ్చిన స్పందనతో కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ జాతీయ పార్టీ కావడంతో ఇతర పార్టీలతో పొత్తులు ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి పొత్తులపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారు.

KE Krishnamurthy again on alliance with Congress

కాగా, రెండు రోజుల క్రితం కూడా కేఈ పొత్తుపై మాట్లాడారు. పొత్తు మీద బహిరంగంగా మాట్లాడటంపై టీడీపీ నేతలు కొందరు పరోక్షంగా విమర్శించారు. పార్టీ వేదికల్లో అభిప్రాయం చెప్పాలని, బహిరంగంగా మాట్లాడి పార్టీ కేడర్‌కు ఏం సందేశమిస్తున్నారని కేఈని ఉద్దేశించి వర్ల అన్నారు. వర్ల ఎవరు తనకు చెప్పడానికని డిప్యూటీ సీఎం కేఈ మండిపడ్డారు.

కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో కిందిస్థాయి కేడర్‌ నుంచి వచ్చిన అభిప్రాయాలనే తాను వెల్లడించానని కేఈ అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని చెప్పారు. ఈ విషయం తమ మనస్సుల్లో హత్తుకుపోయిందన్నారు. కాంగ్రెస్‌ పొత్తుపై మాట్లాడినందుకు సీఎం చంద్రబాబు తనను మందలించారనడంలో నిజం లేదన్నారు.

English summary
TDP leader and Deputy Chief Minister KE Krishnamurthy again on alliance with Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X