కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజలు ఆనందించేలా బాబు శుభవార్త: గైర్హాజరుపై కేఈ వివరణ, బైరెడ్డి చేరితో ఓకే

తాను తాటాకు చప్పుళ్లకు భయపడనని సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం వైసిపి అధినేత జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: తాను తాటాకు చప్పుళ్లకు భయపడనని సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం వైసిపి అధినేత జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కర్నూలు జిల్లా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ బహిరంగ సభలోను మాట్లాడారు.

తలలు పగులగొట్టుకున్న మహేష్-పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మొత్తం తీసేయండి.. హోంమంత్రితలలు పగులగొట్టుకున్న మహేష్-పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మొత్తం తీసేయండి.. హోంమంత్రి

ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చంద్రబాబు అన్నారు. పేదవాడికి అండగా ఉండడమే తన జీవితాశయమని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పని చేస్తున్నానని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకాడేది లేదన్నారు. రైతులను ఆదుకుంటామన్నారు.

నమ్ముకున్న వారి కోసం పని చేస్తా

నమ్ముకున్న వారి కోసం పని చేస్తా

సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని, పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నానని చంద్రబాబు తెలిపారు. నన్ను నమ్ముకున్న ప్రజల కోసమే పని చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరతను అధిగమించామన్నారు.

విద్యుత్ ఛార్జీలు పెంచమని

విద్యుత్ ఛార్జీలు పెంచమని

వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలని, తద్వారా నీటి సమస్యను అధిగమించాలని చెప్పారు. రాబోయే రోజుల్లో విద్యుత్‌ ఛార్జీలు పెంచడం ఉండదని చంద్రబాబు ఏపీ ప్రజలు సంతోషపడే విషయం తెలిపారు. ఉరవకొండలో మాట్లాడుతూ.. 40వేల మంది బిసి యువతులకు పెళ్లి చేస్తామన్నారు. నీతివంతమైన పాలన అందిస్తామన్నారు.

ముందే జాగ్రత్తపడ్డ కేఈ

ముందే జాగ్రత్తపడ్డ కేఈ

ఇదిలా ఉండగా, ముచ్చుముర్రి ఎత్తిపోతల కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పాల్గొనలేదు. సీఎంపై కేఈ అసంతృప్తితో ఉన్నట్లు గతంలో పలుమార్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేఈ ముందే జాగ్రత్త పడ్డారు.

అనారోగ్యం వల్లే సభకు వెళ్లలేదు, వేరే ఉద్దేశ్యం లేదు

అనారోగ్యం వల్లే సభకు వెళ్లలేదు, వేరే ఉద్దేశ్యం లేదు

తాను ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేకపోయానో కేఈ వెల్లడించారు. అనారోగ్యం కారణంగానే తాను కర్నూలు జిల్లాలో జరిగిన చంద్రబాబు సభకు రాలేకపోయానని చెప్పారు. అంతే తప్ప వేరే ఉద్దేశ్యం లేదన్నారు.

బైరెడ్డిని చేర్చుకుంటే ఓకే

బైరెడ్డిని చేర్చుకుంటే ఓకే

రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డిని టిడిపిలో చేర్చుకోవాలని చంద్రబాబు నిర్ణయిస్తే తాను స్వాగతిస్తానని కెఈ చెప్పారు. నాయకుడి నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలన్నారు.

English summary
Deputy chief minister KE KRishnamurthy on Friday said why he not participated in AP CM Nara Chandrababu Naidu's kurnool district public meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X