కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో జేసీ దివాకర్ రెడ్డి.. కేఈ ప్రభాకర్, అధికారంలోకి వస్తే గేటు బయటే పోలీసులు..

|
Google Oneindia TeluguNews

కేఈ ప్రభాకర్.. కేఈ కృష్ణమూర్తి సోదరుడిగానే సుపరిచితం. కర్నూలులో కేఈ సోదరుల హవా కొనసాగుతోంది. కానీ ప్రభాకర్ స్వభావం దూకుడు కాదు. కానీ శుక్రవారం కార్యకర్తల సమావేశంలో మాత్రం రెచ్చిపోయారు. పోలీసులపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. గత డిసెంబర్‌లో జేసీ దివాకర్ రెడ్డి మాదిరిగానే కామెంట్ చేశారు. ఇప్పుడు లోపలికి వచ్చిన పోలీసులు.. టీడీపీ అధికారంలోకి వస్తే గేటు బయటే ఉండాలని హాట్ కామెంట్స్ చేశారు.

అధికారంలోకి వస్తే..

అధికారంలోకి వస్తే..

వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం అని ధీమాలతో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తామంటే ఏంటో చూపిస్తామని కేఈ ప్రభాకర్ హెచ్చరించారు. ఈ రోజు ఇంట్లోకి వచ్చిన పోలీసులను.. ఇంటి గేటు బయట నిలబెడతామని కామెంట్ చేశారు. కేఈ ప్రభాకర్ కామెంట్లు చేస్తుండగా... టీడీపీ శ్రేణులు అరచి గోల చేశారు.

కనిపించండం లేదా..?

కనిపించండం లేదా..?

గత తొమ్మిదేళ్లుగా సారా వ్యాపారం చేస్తున్నవారిని ఎందుకు వదిలేశారని కేఈ ప్రభాకర్ ప్రశ్నించారు. గత డిసెంబర్‌లో పోలీసుల తీరుపై జేసీ దివాకర్ రెడ్డి బాహాటంగానే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. చాలారోజుల తర్వాత కేఈ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు సాక్షిగా..

చంద్రబాబు సాక్షిగా..

డిసెంబర్ 18వ తేదీన అనంతంపురంలో టీడీపీ నాయకుల సమావేశం జరిగింది. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై విరుచుకుపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తా అని వారిని కించపరుస్తూ మాట్లాడారు.

వైసీపీ నేతలకు మాత్రం..

వైసీపీ నేతలకు మాత్రం..

ఎస్పీ, ఆ స్థాయి పైన అధికారులు గానీ, కింది స్థాయి అధికారులు టీడీపీ నేతలను పట్టించుకోవడం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం ఎస్పీని ఉదహరిస్తూ.. మిగతా పోలీసుల వైఖరిపై కూడా జేసీ ఫైరయ్యారు. టీడీపీ అధికారంలోకి వస్తే వారి సంగతి చెబుతామని సభా వేదికనుంచి హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు కొందరు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

English summary
tdp leader ke prabhakar angry on police behaviour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X