వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ వరదలు: రూ.5కోట్లు సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు, ప్రజలకు పిలుపు

|
Google Oneindia TeluguNews

Recommended Video

కేరళకి అన్ని రాష్ట్రా ప్రభుత్వాల నుండి భారీ విరాళాలు

అమరావతి: భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్న కేరళ ప్రజలను మనమందరం కలిసి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అల్లాడుతున్న కేరళకు అన్ని వర్గాల నుంచి సాయం లభిస్తోంది.

కేరళ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం తరఫున రూ.5 కోట్ల విరాళం ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.కాగా, భారీ వరదలకు కేరళలో గురువారం రాత్రి వరకూ 97 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో తమను ఆదుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Kerala floods: Andhra Pradesh Govt contributes Rs 5cr for relief work

తాజాగా కేరళ విపత్తు నేపథ్యంలో రూ.5 కోట్ల సాయాన్ని ప్రకటించిన చంద్రబాబు.. కేరళ విపత్తు నిర్వహణ సంస్థకు విరివిగా విరాళాలు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ట్విట్టర్‌లో డొనేషన్లు ఇవ్వాల్సిన వెబ్‌సైట్ లింక్‌ను కూడా పోస్ట్ చేశారు.

చంద్రబాబు పిలుపుతో కొందరు అభిమానులు వెంటనే చిన్నచిన్న మొత్తాలను డిపాజిట్ చేశారు. వాటి స్క్రీన్ షాట్లను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మరికొందరేమో నగదు కాకుండా నిత్యావసరాలు, ఆహారపదార్థాలు అందించాల్సిందని వ్యాఖ్యానించారు. కాగా, టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ రూ. 25లక్షలు, మరో హీరో విజయ్ దేవరకొండ రూ. 5లక్షలు, మరికొందరు కూడా కేరళకు సాయంగా అందించారు.

English summary
The Andhra Pradesh government on Friday extended help to its Kerala counterpart, which is currently tackling one of the worst floods in the history of the state. Taking to Twitter, Andhra Chief Minister N Chandrababu Naidu announced that the state will contribute Rs 5 crore for the relief work in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X