విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బంపర్ ఆఫర్: కేశినేని ట్రావెల్స్ బస్సులు ఆర్టీసీలో అద్దెకు?

కేశినేని ట్రావెల్స్ మూసివేత వ్యూహత్మకంగానే సాగిందనే ప్రచారం సాగుతోంది. ఆర్ టి సి లో అద్దెబస్సుల రూపంలో కేశినేని ట్రావెల్స్ కు చెందిన బస్సులను తీసుకొనేందుకుగాను ముందుజాగ్రత్తగా ట్రావెల్స్

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కేశినేని ట్రావెల్స్ మూసివేత వ్యూహత్మకంగానే సాగిందనే ప్రచారం సాగుతోంది. ఆర్ టి సి లో అద్దెబస్సుల రూపంలో కేశినేని ట్రావెల్స్ కు చెందిన బస్సులను తీసుకొనేందుకుగాను ముందుజాగ్రత్తగా ట్రావెల్స్ ను మూసివేశారనే ప్రచారం సాగుతోంది.

రవాణాశాఖ కార్యాలయంలో అధికారులపై గొడవ జరిగిన తీరు పట్ల టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విజయవాడ ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్ రావులపై సీరియస్ అయ్యారు.

అయితే అదే సమయంలో తాను ట్రావెల్స్ ను మూసివేస్తానని కేశినేని నాని ప్రకటించారు.అయితే ఈ విషయమ చంద్రబాబునాయుడు జోక్యం చేసుకోవడంతో తాత్కాలికంగా నాని తన నిర్ణయాన్ని వాయిదావేసినప్పటికీ ట్రావెల్స్ ను మాత్రం మూసివేశారు.

అయితే ఆర్ టి సి లో తన ట్రావెల్స్ బస్సులను అద్దెకు తిప్పేందుకుగాను ట్రావెల్స్ ను మూసివేశారనే ప్రచారం కూడ ఉంది.అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.

ఆర్ టి సికి అద్దెబస్సులు అవసరమా?

ఆర్ టి సికి అద్దెబస్సులు అవసరమా?

ఆర్ టి సి అద్దె బస్సులను భరించే పరిస్థితిలో లేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 11,865 బస్సులున్నాయి. అందులో ఏసీ బస్సులు 2,700, స్లీపర్ 5, డీలక్స్ 613, సూపర్ లగ్జరీ 752 ఎక్స్ ప్రెస్ లు2117, ఆర్ఢీనరీ బస్సులు5,678 ఉన్నాయి.అయితే ఎసీ బస్సులను ప్రధానంగా విజయవాడ- బెంగుళూరు, హైద్రాబాద్ - విశాఖపట్నం రూట్లో నడుపుతున్నారు. ఆరు మాసాల వరకు ఆర్టీసీలో అద్దెబస్సులు లేవు. అయితే తొలిసారి 21 ఇంద్ర బస్సులను అద్దెకు తీసుకొన్నారు.అయితే అద్దె బస్సులు ప్రభుత్వానికి గుదిబండగా మారే అవకాశం ఉందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు అద్దె బస్సలు వల్ల ఉద్యోగులు, కార్మికుల జీవనోపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందని కార్మికసంఘాలు ఆరోపిస్తున్నాయి.

కేశినేని ట్రావెల్స్ కు లైన్ క్లియర్?

కేశినేని ట్రావెల్స్ కు లైన్ క్లియర్?

ఆరు మాసాల వరకు ఆర్ టి సి లో అద్దె బస్సులు లేవు. అయితే కేశినేని ట్రావెల్స్ కోసమే 21 అద్దె బస్సులను తీసుకొన్నారని సమాచారం.కేశినేని ట్రావెల్స్ లో సుమారు 170 బస్సులున్నాయి.అయితే వీటిలో వంద బస్సులు కండీషన్ లో ఉన్నాయి. ఈ వంద బస్సులను అద్దె ప్రాతిపదికన ఆర్ టి సి కి ఇవ్వాలని రంగం సిద్దం చేశారని సమాచారం.

బస్సుల కొరత పేరుతో అద్దె బస్సులు

బస్సుల కొరత పేరుతో అద్దె బస్సులు

వేసవికాలంలో బస్సుల కొరత పేరుతో అద్దె బస్సులను తీసుకోనేందుకు ఆర్ టి సి రంగం సిద్దం చేసింది. ఈ మేరకు అద్దె బస్సులను తీసుకొనేందుకుగాను త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నారు.ఈ మేరకు అధికార పార్టీకి చెందిన కార్మిక సంఘాలు అద్దె బస్సులు తీసుకొంటేనే సమస్యకు పరిష్కారమంటూ ప్రచారం ప్రారంభించారు.త్వరలోనే అద్దెకు బస్సులను తీసుకోనున్నారని సమాచారం.

అద్దె బస్సులతో ఆర్టీసీకి నష్టాలు

అద్దె బస్సులతో ఆర్టీసీకి నష్టాలు

అద్దె బస్సుల వల్ల ఆర్టీసీకి నష్టాలే కలుగుతాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.అయితే అద్దెకు బస్సులను తీసుకోవడం వల్ల ఆర్టీసీ మరింత నష్టాల బారిన పడే అవకాశం ఉందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఆర్టీసీని ప్రైవేటీకరించడం మినహ మరో మార్గం లేదనే స్థితికి వచ్చే ప్రమాదం లేకపోలేదని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.

English summary
Kesineni Nani planned to move his buses into Rtc for hire.He closed kesineni travels recently.Rtc unions opposed for hire buses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X