విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుర్గా పీఠంను రూ. కోటికి మోసగించిన కేశినేని రమేష్‌ అరెస్ట్‌,రివాల్వర్ స్వాధీనం

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విజయవాడ: దుర్గా పీఠం భూ కుంభకోణంలో నిందితుడు కేశినేని రమేష్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి ఒక రివాల్వర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

కేశినేని రమేష్ ఓ కాంట్రాక్టర్‌ వద్ద పని చేస్తున్నట్లు తెలిసింది. భవానీ దుర్గా గురుపీఠం ఆశ్రమం కోసం భూమి అమ్మకం పేరుతో రమేష్‌ కోటి రూపాయలు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందింది. రమేష్‌పై ఇప్పటికే పలు ప్రాంతాల్లో చీటింగ్‌ కేసులున్నట్లు సమాచారం. ఈ ఛీటింగ్ కేసుకు సంబంధించి కేశినేని రమేష్‌తో పాటు అతనికి సహకరించిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 Kesineni Ramesh arrest who cheated Durga trust for 1 crore Rupees

భవానీ భక్తుల ఆ‍శ్రమం కోసం నూజీవీడులో 100 ఎకరాల భూమి ఉందంటూ అఖిల భారత భవానీ పీఠంను సంప్రదించాడు కేశినేని రమేష్ అలియాస్‌ నవీన్‌. ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు అంటూ కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు చూపించి విడతల వారీగా కోటి రూపాయలు అఖిల భారత భవానీ పీఠం నుంచి డబ్బులు వసూలు చేశాడు. అయితే ఆ వంద ఎకరాల భూమితో రమేష్ కు ఎలాంటి సంబంధం లేదని దుర్గా ట్రస్ట్ నిర్వాహకులకు తెలిసింది.

ఈ మోసాన్ని గ్రహించిన ట్రస్ట్‌ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులు విరాళాలు ఇచ్చిన సొమ్ము ఈ విధంగా స్వాహా అయినట్లు పోలీసులకు తెలిపారు. ట్రస్ట్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు నిందితుడు కేశినేని రమేష్‌ను శుక్రవారమే అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం అతడి అరెస్ట్ ను అధికారికంగా ధృవీకరించారు.

English summary
Vijayawada:Police arrested a Man on Monday for cheating. The man obtained cash to the tune of Rs 1 crore from from Durga trust with fake documents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X