వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేశినేనిట్రావెల్స్ ఉద్యోగుల ధర్నా వెనుక రాజకీయకుట్ర .. 14 మందికే నేను బాకీ.. మిగతా వారెవరో తెలీదు

|
Google Oneindia TeluguNews

ఊహించని విధంగా కేశినేని నానీపై వేతనాల కోసం ఆ సంస్థ సిబ్బంది ధర్నాకు దిగటం, తమకు బకాయిపడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేయటంలో రాజకీయకుట్ర ఉందని కేశినేని ఆరోపిస్తున్నారు . ఎప్పుడైతే పీవీపీ కేశినేని నానీ ట్రావెల్స్ ఉద్యోగుల విషయంలో పోస్ట్ పెట్టారో అప్పుడు నానీ పీవీపీ కుట్రగా దీనిని పేర్కొన్నారు. ఇంతకాలం అడగని వారు ఒక్కసారిగా ఆందోళన బాట పట్టటం , కోర్టు మెట్లెక్కటం వెనుక పీవీపీ రాజకీయ కుట్ర ఉంది అని కేశినేని మండిపడుతున్నారు.

కేశినేని ట్రావెల్స్ విషయంలో జరుగుతున్న రాద్దాంతం ఒక రాజకీయ కుట్ర అంటున్న కేశినేని నానీ

కేశినేని ట్రావెల్స్ విషయంలో జరుగుతున్న రాద్దాంతం ఒక రాజకీయ కుట్ర అంటున్న కేశినేని నానీ

కేశినేని ట్రావెల్స్ ఉద్యోగుల జీతాల వ్యవహారంపై వైసీపీ నేత పీవీపీ (పొట్లూరి వరప్రసాద్), ఎంపీ కేశినేని నాని ని టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. . బాధితులకు మద్దతుగా పీవీపీ ట్వీట్ చేశారు. 'కసాయివాడికి గొర్రెమీద ఉన్న ప్రేమ కూడా నీకు నీ దగ్గర పనిచేసిన కార్మికుల మీద లేదే.. వేలాదిమంది పొట్టకొట్టి ఈరోజు నువ్వు అందలమెక్కి కూర్చున్నావు.. కడుపుకాలి ఆ కడుపుమంటతో రోడ్డెక్కిన వేలాది కుటుంబాలను ఆదుకో.. లేదంటే నీ బాస్ లాగా సంకనాకిపోతావ్' అంటూ ట్వీట్ చేశారు పీవీపీ . ఎప్పుడైతే పీవీపీ ఈ విషయంలో జోక్యం చేసుకున్నారో అప్పుడే ఇందులో కుట్ర వుందని పేర్కొన్నారు కేశినేని నానీ . అంతే కాదు ధర్నా చేస్తున్న వారి వద్దకు వెళ్లి డబ్బులిచ్చి సెటిల్ చెయ్యాలని ప్రయత్నం చేసిన కేశినేని అనుచరులను గో బ్యాక్ అంటూ , కేశినేని వచ్చి సమాధానం చెప్పాలంటూ ఆందోళన చెయ్యటం అక్కడ ఘర్షణకు దారి తీసింది. ఇదంతా డబ్బు కోసం కాదని కేవలం రాజకీయమని కేశినేని ఫైర్ అవుతున్నారు.

ఆ 14 మందికే నేను బాకీ .. లేబర్ కోర్టులో కేసు విత్ డ్రా చేసుకుంటే వారి డబ్బు చెల్లిస్తానాన్న నానీ

ఆ 14 మందికే నేను బాకీ .. లేబర్ కోర్టులో కేసు విత్ డ్రా చేసుకుంటే వారి డబ్బు చెల్లిస్తానాన్న నానీ

పీవీపీ ట్వీట్‌పై ఎంపీ కేశినేని నాని ఘాటుగా స్పందించారు. ఇదంతా పీవీపీ కావాలని చేయిస్తున్న కుట్రని ఆరోపించారు.తాను ఎవరికి రూపాయి కూడా బాకీ పడలేదని చెప్పిన నానీ గుంటూరు లేబర్ కోర్టులో 14 మంది కేసులు వేశారని, వాళ్లకి మాత్రమే ఇవ్వాల్సి ఉందని, రాజీకి వచ్చి కేసు విత్ డ్రా చేసుకుంటే ఈ నిమిషంలోనే వారి బకాయిలను చెల్లిస్తానని కేశినేని నానీ స్పష్టం చేశారు.ఈ విషయాన్ని తాను ఎన్నికల అఫిడవిట్‌లో సైతం పొందుపరిచానని ఎంపీ తెలిపారు. కేశినేని ట్రావెల్స్ మూసివేసి రెండున్నరేళ్లు అవుతుందని.. ఈ రాద్ధాంతం వెనుక రాజకీయ కుట్ర వుందని కేశినేని నాని ధ్వజమెత్తారు.

ధర్నా చేసింది కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు కాదు.. కిరాయి మనుషులు .. తాను పీవీపీలావేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టలేదన్న నానీ

ధర్నా చేసింది కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు కాదు.. కిరాయి మనుషులు .. తాను పీవీపీలావేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టలేదన్న నానీ

అంతే కాదు ధర్నా చేసిన వారిలో కేశినేని ట్రావెల్స్ సిబ్బంది ఎవరు లేరని వారంతా కిరాయి మనుషులేనని ఆరోపించారు కేశినేని . ఏ కమిషన్ అయినా.. సీబీఐ, ఈడీ దర్యాప్తులకైనా తాను సిద్ధమేనని.. 2013 నుంచే కేశినేని ట్రావెల్స్ బాధ్యతల నుంచి తాను తప్పుకున్నానని నాని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ధర్నా చేస్తున్న వాళ్లు తన దగ్గరకు వస్తే వెంటనే డబ్బులు ఇచ్చేయడానికి సిద్ధమన్నారు. పీవీపీలా తాను వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టలేదని.. నాదర్ గుల్ భూములు కబ్జా చేయలేదని, కోల్ గేట్ స్కాంలో లేనని చాలా ఘాటుగా కౌంటరిచ్చారు. నేను రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదని , ఎవరి పోస్ట్ లకు సమాధానం చెప్పాల్సిన పని లేదని , ఎవరు నాశనమవుతారో అన్నింటికి భగవంతుడే ఉన్నాడన్నారు కేశినేని . ఏది ఏమైనా రాజకీయ కక్షలు కాస్తా వ్యక్తిగత వ్యవహారాల మీద, వ్యాపారాల మీదకు మళ్ళటం చూస్తుంటే భవిష్యత్ లో ఇంకేం జరుగుతుందో అన్న ఆందోళన ఏపీలో కనిపిస్తుంది.

English summary
Vijayawada TDP MP Kesineni Nani was shocked with the sudden dharna of keshineni travels employees. Undoubtedly, Keshineni alleges that the staff of the keshineni tarvels has gone to Dharna for demanding immediate remuneration of of their dues is a political conspiracy. When the PVP posts on this issue about keshineni travels dues nani said that it is nothing but PVP Conspiracy. Those who have not heard so far are suddenly aggitated nani alligated that PVP political conspiracy behind the issue .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X