వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, మహేష్ కత్తి వివాదంలో చిరంజీవి జోక్యం"

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్ ఫ్యాన్స్-మహేష్ కత్తి వివాదంలో చిరంజీవి జోక్యం..!

చెన్నై: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులకు, మహేష్ కత్తికి మధ్య తలెత్తిన వివాదంలో జోక్యం చేసుకోవాలని సినీ నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని కోరారు.

కత్తి మహేష్, పవన్ అభిమానుల వివాదంలో ఒక మంచివారుగా ,ఆత్మీయవ్యక్తిగా ప్రజల గుండెల్లో ఉన్న చిరంజీవి జోక్యం చేసుకొని వివాదానికి తెర దించాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.

మీరు రాజశేఖర్ ఇంటికి వెళ్లారు...

మీరు రాజశేఖర్ ఇంటికి వెళ్లారు...

గతంలో మీపై సినీ నటుడు రాజశేఖర్ వ్యాఖ్యలు చేస్తే, అందుకు నిరసన గా మీ అభిమానులు ఆయనపై దాడి చేశారు.,మీరు స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్సించి ఒక మంచి సంప్రదాయానికి నిదర్శనంగా నిలిచారు అని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. అలా వివాదాన్ని పరిష్కరించారని ఆయన అన్నారు.

 పవన్ కల్యాణ్ ఎవరికీ తలవంచరు..

పవన్ కల్యాణ్ ఎవరికీ తలవంచరు..

గుణగణాల ద్వారా పవన్ కల్యాణ్ ఎవరికీ తలవంచరని, గతంలో ప్రజారాజ్యం పార్టీ యువనేతగా పవన్ కల్యాణ్ కాంగ్రెస్ వారిని పంచలు విప్పాలని అన్నారని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గుర్తు చేశారు..పవన్ కల్యాణ్ నిజాయితీ పరుడని, నిజాయితీ ఉన్నవాడికి ఆవేశం ఎప్పుడు ఉంటుందని, .తాము చేప్పాలనుకున్న మాటలను నిక్కచ్చిగా చెప్పడానికి సంకోచించరని ఆనయ అన్నారు.

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు..

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు..

పవన్ కల్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన ఎర్పాటు చేసిన జనసేన పార్టీ లక్యం నచ్చితే జనం తప్పకుండా ఆదరిస్తారని, చంద్రబాబు నాయుడికి గత ఎన్నికల్లో ప్రచారం చేసి అ పార్టీ విజయంలో భాగస్వామి అయ్యారని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. అందువల్ల రాష్ట్రంలో తన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం పవన్ కల్యాణ్ బాధ్యత అని ఆయన అన్నారు.

 వచ్చే ఎన్నికల్లో మరి..

వచ్చే ఎన్నికల్లో మరి..

వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ,చంద్రబాబుకు మద్దతు ఇస్తారా, జగన్‌కు, బీజేపీకి మద్దతు ఇస్తారా, సొంతంగా పోటీ చేస్తారా అనేది ఇప్పుడు మాట్లాడడం అనవసరమని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. అది అప్పటి రాజకీయ సమీకరణలపై ఆధా పడి ఉంటుందని అన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనే విషయాన్ని మొదట పవన్ కళ్యాణ్ అభిమానులు గ్రహించాలని ఆయన అన్నారు.

 రాజకీయం వేరు, సినిమా అభిమానం వేరు

రాజకీయం వేరు, సినిమా అభిమానం వేరు

రాజకీయం వేరు సినిమా అభిమానం వేరని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నాయకులందరూ విమర్శలు చేశారని, అదే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారని అన్నారు. అవకాశం లేనప్పుడు అవసరాన్ని వాడుకోవటమై రాజకీయ సిద్ధాంతమని,.ఇది పవన్ కల్యాణ్ అభిమానులు తెలుసుకుని సంయమనం పాటించాలని ఆయన అన్నారు.

 గోటితో పోయేదాన్ని గొడ్డలితో..

గోటితో పోయేదాన్ని గొడ్డలితో..

కత్తి మహేష్ వ్యవహారం గురించి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గోరుతో పోయే దాన్ని గొడ్డలి వరకు తీసుకురావటం మంచిది కాదని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు మీ కుటుంబాన్ని అభిమానించే అందరికి చాలా బాధ కలిగిస్తోందని అన్నారు. సుహృద్భావంతో కత్తి మహేష్‌ని పిలిచి మాట్లాడి ఈ సంక్రాంతితో వివాదానికి తెర దించాలని ఆయన చిరంజీవిని కోరారు.

English summary
Tamil Nadu Yuvasakki president Kethireddy Jagadeeswar Reddy appeals to Chiranjeevi to Interveen in the controversy took place between Mahesh Kathi and Pawan Kalyan's fans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X