వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీవారిపై కనిమొళి వ్యాఖ్యలు: తెలుగు యువశక్తి నేత ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామిపై కనిమొళి చేసిన వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వివాదం సష్టించడం ద్వారా వార్తల్లో ఉండాలను కోవటం ఒక కొత్త రాజకీయ ఎత్తుగడలో భాగమని ఆయన అన్నారు.

వివాదాస్పదమైన మాటలు మాట్లాడటం, ప్రజలను ఆశాంతికి గురిచేయటం తమిళ రాజకీయ నాయకుల లక్హ్యమని ఆయన ఓ ప్రకటనలో అన్నారు. గతం లో కూడా 2006 నిర్బంధ తమిళ బాష బోధన అనే చట్టాన్ని తీసుకువచ్చి ఇప్పటి వరకు మైనార్టీ ప్రజల హక్కులను హరించి వారిని గందరగోళం చేశారని ఆయన విమర్శించారు.

Kethireddy Jagadeeswar Reddy condemns Kanimozhi comments

అది కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనల కోసమే చేశారని అన్నారు. ఇప్పుడు మళ్లీ వారి రాజకీయ ప్రయోజనాల కోసం వెంకన్నపై తిరుచ్చి పట్టణంలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిపై తప్పుడు వాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను గాయ పరుచడానికి కనిమొళి ఇలాంటి వాఖ్యలను చేశారని ఆయన అన్నారు.

కనిమొళి వెంటనే వాఖ్యలను వెనుకకు తీసుకొని హిందూ మతస్థులకు ,వెంకన్న భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, తన కుటుంబం లోని స్టాలిన్ .స్టాలిన్ భార్య అందరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులని ఆయన గుర్తు చేశారు.

దేశంలో పెరిగిపోతున్న తీవ్రవాదాన్ని అరికట్టడానికి, భక్తులకు రక్షణగా భద్రతదళాలు ఉన్నాయని, హుండీ భద్రత కోసం భద్రతా సిబ్బంది లేరని ఆయన అన్నారు. ముఖ్యంగా ఎదో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలలో ఉండాలని అనుకోవటం సిగ్గు చేటు అని ఆయన అన్నారు.

శ్రీ వెంకటేశ్వర స్వామిపై చేసిన వ్యాఖ్యలకు కనిమొళి తగిన మూల్యం త్వరలో చైలించటం ఖాయమని అన్నారు. రాష్టప్రతి, ప్రధానమంత్రి. కేంద్ర హోంమంత్రి వెంటనే జోక్యం చేసుకొని కనిమొళిపై చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు.

English summary
Tamil Nadu Telugu Yuva Shakti leader Kethireddy Jagadeeswar Reddy lashed out at DMK leader Kanimozhi for making comments on Tirupathi Sri Venkateaswara Swami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X