వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భీమిలి లో లోకేష్ పోటీ చేస్తే: వైసిపి నేత‌లు చెబుతుందేటి : ప‌వ‌న్ క‌ళ్యాన్ బరిలోకి దిగితే..!

|
Google Oneindia TeluguNews

విశాఖ జిల్లా భీమిలి లో మంత్రి లోకేష్ పోటీ చేయ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో లోకేష్ అక్క‌డి నుండి పోటీ చేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే గంటాను లోక్‌స‌భ కు పంపే అంశం మీదా చ‌ర్చ సాగుతోంది. అయితే, లోకేష్ భీమిలి లో పోటీ చేస్తే..మా నెత్తిన పాలు పోసినట్లే అంటున్నారు వైసిపి నేత‌లు. కానీ, నిజంగా భీమిలిలో టిడిపి అంత బ‌ల‌హీనంగా ఉందా..మంత్రిగా ఉన్న లోకేష్ అక్క‌డ గెలిచే అవ‌కాశాలు ఏ విధంగా ఉన్నాయి. అదే విధంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ బ‌రిలోకి దిగితే..ఏం జ‌ర‌గ‌బోతోంది..

భీమిలి నుండి లోకేష్‌..

భీమిలి నుండి లోకేష్‌..

విశాఖ పార్ల‌మెంట్ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు టిడిపి అధినేత చంద్ర‌బాబు అభ్య‌ర్ధుల‌ను దాదాపు ఖ‌రారు చేసారు. భీమిలి మాత్రం ఇంకా ఎవ‌రికీ కేటాయించ లేదు. ప్ర‌స్తుతం మంత్రి గంటా శ్రీనివాస రావు అక్క‌డ సిట్టింగ్ ఎమ్మె ల్యేగా ఉన్నారు. లోకేష్ భీమిలి నుండి పోటీ చేస్తే..తాను మ‌రో చోట నుండి బ‌రిలోకి దిగుతాన‌ని గంటా ప్ర‌తిపాదించారు. ఇప్ప‌టికే ఎమ్మెల్సీ అయి దొడ్డి దారిలో మంత్రి అయ్యారంటూ లోకేష్ పై వైసిపి నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో, టిడిపికి బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేయ‌టం ద్వారా గెలుపు ఖాయం చేసుకోవాల‌ని లోకేష్ భావిస్తున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ నుండి బ‌రిలో ఉండ‌టంతో..త‌న‌యుడు లోకేష్ ఉత్త‌రాంధ్ర నుండి పోటీ చేస్తే అక్క‌డ పార్టీకి బ‌లం పెరుగుతుంద‌ని అంచనా వేస్తున్నారు.

ఆరు సార్లు గెలిచిన టిడిపి..

ఆరు సార్లు గెలిచిన టిడిపి..

భీమిలి నియోజ‌క‌వ‌ర్గం 1972 లో ఏర్పాటైంది. అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది సార్లు ఎన్నిక‌లు జరిగాయి. అందులో ఆరు సార్లు టిడిపి గెలిచింది. మూడు సార్లు కాంగ్రెస్ నెగ్గింది. ఇక‌, 2009 లో ప్ర‌జారాజ్యం నుండి పోటీ చేసిన ప్ర‌స్తుత అన కాప‌ల్లి ఎంపి అవంతి శ్రీనివాస రావు ఎమ్మెల్యేగా టిడిపి అభ్య‌ర్ది మీద గెలుపొందారు. ఆ త‌రువాత 2014 ఎన్నిక‌ల్లో అవం తికి ఎంపి సీటు ఇవ్వ‌గా..గంటా శ్రీనివాస రావు భీమిలి నుండి ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగి వైసిపి అభ్య‌ర్ది క‌ర్రి సీతారం పై గెలు పొందారు. అయితే, గంటా ఒక ఎన్నిక‌ల్లో గెలిచిన సీటు నుండి మ‌రో సారి పోటీ చేయ‌టం అల‌వాటు లేదు. దీంతో, ఈ సారి భీమిలి నుండి లోకేష్ ను దింపి..విశాఖ ఉత్త‌రం లేదా విశాఖ లోక్‌స‌భ నుండి బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. ఇక‌, ఐటి మంత్రిగా భీమిలి ప‌రిస‌ర ప్రాంతాల్లో అనేక సంస్థ‌ల ఏర్పాటుకు లోకేష్ చేసిన కృషి..ఉద్యోగ క‌ల్ప‌న కార‌ణంగా ఆ నియోజ‌క‌వ‌ర్గం లోకేష్ కు అనుకూలంగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఏపీ నాయకుల సిత్రాలు .. ఉదయం వైసీపీ తీర్ధం .. సాయంత్రానికి టీడీపీ బాటఏపీ నాయకుల సిత్రాలు .. ఉదయం వైసీపీ తీర్ధం .. సాయంత్రానికి టీడీపీ బాట

ప‌వ‌న్ బ‌రిలోకి దిగితే...

ప‌వ‌న్ బ‌రిలోకి దిగితే...

లోకేష్ తొలి సారి భీమిలి నుండి బ‌రిలోకి దిగితే త‌మ నెత్తిన పాలాభిషేకం చేసిన‌ట్లేన‌ని వైసిపి నేత‌లు అంటున్నారు. కొద్ది రోజుల క్రితం టిడిపికి రాజీనామా చేసి వైసిపి లో చేరిన ఎంపీలు అవంతి శ్రీనివాస రావు, రవీంద్ర బాబు భీమిలి నుండి లోకేష్ పోటీ చేసే అంశం పై స్పందించారు. మంత్రిగా..ముఖ్య‌మంత్రి త‌న‌యుడిగా గ్రామీణ ప్రాంతం లేదా వెనుక బడిన నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేసి దాని అభివృద్దికి పాటు ప‌డాల్సిన లోకేష్ భీమిలి ఎంచుకోవ‌టం ద్వారా నే త‌నలోని అప‌న‌మ్మ‌కాన్ని బ‌య‌ట పెట్టుకున్నార‌ని ఎద్దేవా చేసారు. లోకేష్ ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌లతో నేరుగా సంబం దాలు లేవ‌ని..ఆయ‌న ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో దిగి గెల‌వ‌టం సులువు కాద‌ని వారు వ్యాఖ్యానిస్తున్నారు. భీమిలి నుండి లోకేష్ బ‌రిలో దిగితే త‌న విజ‌యం ఖాయ‌మ‌ని అవంతి శ్రీనివాస్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ సైతం ఇక్క‌డి నుండి పోటీ చేస్తార‌ని చెబుతున్నారు. అదే జ‌రిగితే..ఇక్క‌డ స‌మీక‌ర‌ణాలు మొత్తం గా మారిపోయే అవ‌కాశం ఉంది.

English summary
AP minister Lokesh may contest from Bhimilil constituency in Visakha city. TDP Chief also concentrated on this seat for Lokesh. But, YCP leaders says if Lokesh contest from Bhimili then YCP vicoty is so easy in that constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X