వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ ఎఫెక్ట్: దిగొచ్చిన కేంద్రం, ఫిబ్రవరి 23న, ఢిల్లీకి రావాలని ఆహ్వనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

No-Trust Motion : Union Home Ministry Calls AP Officials

అమరావతి: ఏపీ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రంపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెడతామని వైసీపీ ప్రకటించింది. ఏపీ రాష్ట్ర రాజకీయాలు చాలా హట్‌హట్‌గా మారాయి. ఈ తరుణంలో కేంద్రం నుండి రాష్ట్రానికి మంగళవారం నాడు పిలుపు వచ్చింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఢిల్లీకి రావాలని సమాచారం పంపడం రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకొంది.

ఏపీ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌‌లో నిధుల కేటాయింపు విషయమై పార్టీలన్నీ పెదవి విరుస్తున్నాయి. ఏపీ రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయలేదని పార్టీలన్నీ ఆందోళన బాట పట్టాయి. కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న టిడిపి కూడ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉంది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం తీరును నిరసిస్తూ టిడిపి ఎంపీలు కూడ ఆందోళన బాట పట్టాయి. ఈ తరుణంలో ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా తీసుకోవాలని ఏపీలోని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్రంపై అవిశ్వాసానికి తాము రెడీగా ఉన్నామని వైసీపీ ప్రకటించింది.

కేంద్రంపై అవిశ్వాసాన్ని పెట్టాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పార్టీలను కోరారు. దీనికి వైసీపీ స్పందించింది.కేంద్రంపై తాము అవిశ్వాసాన్ని ప్రతిపాదించనున్నట్టు ప్రకటించింది.

ఢిల్లీ నుండి ఏపీకి పిలుపు

ఢిల్లీ నుండి ఏపీకి పిలుపు

ఏపీలో చోటు చేసుకొంటున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఫిబ్రవరి 23వ, తేదిన ఢిల్లీకి రావాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఢిల్లీకి రావాలని కేంద్రం నుండి మంగళవారం నాడు సమాచారాన్ని ఏపీకి కేంద్రం నుండి రావాల్సిన ప్రాజెక్టులు, నిదుల విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బడ్జెట్ కేటాయింపుల విషయమై ఏపీ ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్న తరుణంలో కేంద్రం నుండి పిలుపు రావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

''పవన్ కళ్యాణ్ వల్లే పబ్లిసిటీ'', ''ఏం జరుగుతుందో చూద్దాం''''పవన్ కళ్యాణ్ వల్లే పబ్లిసిటీ'', ''ఏం జరుగుతుందో చూద్దాం''

రైల్వే జోన్, ఆర్థికలోటు తదితర అంశాలపై చర్చ

రైల్వే జోన్, ఆర్థికలోటు తదితర అంశాలపై చర్చ

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. రైల్వే జోన్ ఏర్పాటు అంశంతో పాటు ఏపీలో రెవిన్యూలోటు , కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశం, దుగరాజుపట్నం పోర్టు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రెవిన్యూ లోటును పూడ్చాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. ఈ తరుణంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్వహించే అ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది

పూర్తి సమాచారంతో రావాలి

పూర్తి సమాచారంతో రావాలి

ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీలు, ఏ మేరకు ఈ హమీలు పూర్తయ్యాయి. ఇంకా ఏయే హమీలను నెరవేర్చాలనే విషయమై స్టేటస్ రిపోర్ట్‌తో రావాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంగళవారం నాడు సమాచారం అందింది. ఫిబ్రవరి 23వ, తేది నాటికి ఢిల్లీలో జరిగే సమావేశానికి పూర్తి సమాచారంతో రావాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ కోరింది.

 తెలంగాణకు కూడ సమాచారం

తెలంగాణకు కూడ సమాచారం

ఏపీకి చెందిన అధికారులతో పాటు తెలంగాణకు చెందిన అధికారులు కూడ ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తొమ్మిది, పదో షెడ్యూల్ సంస్థల విభజన విషయమై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ తరుణంలో హోంమంత్రిత్వశాఖ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

English summary
The Union government sent information to the AP state to come to Delhi for meeting on Feb 23.Union Home ministry will conduct this meeting with Ap state government officials on Ap re- organisation act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X