వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా ముఖ్యుడికి 150 కోట్లు: ఐటీ ప్రకటనతో కలకలం: హవాలాతో బడా కార్పొరేట్ల బంధం..!

|
Google Oneindia TeluguNews

ఆదాయపు పన్ను శాఖ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటన ఇప్పుడు ఏపీలో కలకలానికి కారణమవుతోంది. ఐటీ శాఖ సైతం ఒక ప్రముఖ వ్యక్తి అంటూ చేసిన ఆ ప్రకటనలోని వ్యక్తి ఎవరనేది ఇప్పుడు వ్యాపార.. రాజకీయ ప్రముఖుల్లో హాట్ టాపిక్ గా మారింది.

బోగస్‌ బిల్లులు, హవాలా లావాదేవీలు నిర్వహించే కొందరిపై ఈనెల మొదటి వారంలో దాడులు నిర్వహించాం... మౌలిక సదుపాయాల రంగంలో బోగస్‌ కాంట్రాక్టులు..బిల్లుల ద్వారా నగదును పోగేసుకునే పెద్ద రాకెట్‌ను ఛేదించాం... ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిధులను ఎంట్రీ ఆపరేటర్లు..లాబీయిస్టులు.. హవాలా డీలర్ల ద్వారా దారి మళ్లించాంటూ ఐటీ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. అందులోనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ముఖ్య వ్యక్తికి రూ.150 కోట్లకుపైగా నగదు అందినట్లు సాక్ష్యాధారాలు లభించాయంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఎవరా ప్రముఖుడు.. ఐటీ శాఖ చెప్పినట్లుగా ఆ మఖ్యుడెవరు ఇప్పుడు అదే హాట్ టాపిక్..

42 ప్రాంతాల్లో ఐటీ సోదాల్లో..

42 ప్రాంతాల్లో ఐటీ సోదాల్లో..

ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, ఈరోడ్‌, పుణె, ఆగ్రా, గోవాలలోని 42 ప్రాంతాల్లో ఐటీ అధికారులు భారీగా సోదాలు నిర్వహించారు. ఆ దాడులకు సంబంధించిన సమాచారం గురించి తాజాగా ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేసారు. అందులో.. బోగస్‌ బిల్లులు, హవాలా లావాదేవీలు నిర్వహించే కొందరిపై ఈనెల మొదటి వారంలో దాడులు నిర్వహించామని చెప్పుకొచ్చారు.

మౌలిక సదుపాయాల రంగంలో బోగస్‌ కాంట్రాక్టులు..బిల్లుల ద్వారా నగదును పోగేసుకునే పెద్ద రాకెట్‌ను ఛేదించాంటూ తేల్చారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిధులను ఎంట్రీ ఆపరేటర్లు, లాబీయిస్టులు, హవాలా డీలర్ల ద్వారా దారి మళ్లించారంటూ పేర్కొన్నారు. అయితే అందులోనే మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు అదే ఏపీలో కలకలానికి కారణమవుతోంది.

ఏపీకి చెందిన ముఖ్య వ్యక్తికి రూ.150 కోట్లు..

ఏపీకి చెందిన ముఖ్య వ్యక్తికి రూ.150 కోట్లు..

హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, ఈరోడ్‌, పుణె, ఆగ్రా, గోవాలలోని 42 ప్రాంతాల్లో ఐటీ అధికారులు భారీగా సోదాలు నిర్వహించారు. అందులో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వెచ్చించిన నిధులను తప్పుడు మార్గాల్లో దారి మళ్లించినట్లు గుర్తించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ముఖ్య వ్యక్తికి రూ.150 కోట్లకుపైగా నగదు అందినట్లు సాక్ష్యాధారాలు లభించాయి అని ఆదాయ పన్ను శాఖ తాజా ప్రకటనలో ప్రత్యేకంగా ప్రస్తావించింది.

దీంతో..ఐటీ శాఖ ప్రస్తావించిన ముఖ్య వ్యక్తి ఎవరు..మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన ప్రముఖులా ..లేక ఎవరైనా వ్యాపార ప్రముఖుడా.. రాజకీయంగా ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఆసక్తి కర చర్చ సాగుతోంది.

ఆధారాలు లభించాయనే ప్రకటన వెనుక

ఆధారాలు లభించాయనే ప్రకటన వెనుక

ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేసిన కంపెనీలు ఎక్కువగా ఢిల్లీ..ముంబాయికి చెందినవే. ఇందులో ఒక కంపెనీపై ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఐటీ సోదాలు జరిగాయి. దక్షిణాది రాష్ట్రాల్లో చేపట్టిన ప్రధాన మౌలిక సదుపాయాలు, ఈడబ్ల్యూఎస్‌ ప్రాజెక్టుల్లో బోగస్‌ బిల్లింగ్‌ జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ముఖ్య వ్యక్తికి రూ.150 కోట్లకుపైగా నగదు చెల్లింపులు జరిగినట్లు మా సోదాల్లో ఆధారాలు లభించాయంటూ ఐటీ శాఖ తమ ప్రకటనలో స్పష్టం చేసింది. ఆ ప్రముఖుడికి బడా కార్పొరేట్లు, హవాలా ఆపరేటర్ల మధ్య కొనసాగుతున్న అక్రమ లావాదేవీల సంబంధంపై బలమైన ఆధారాలు లభించాయని స్పష్టం చేసింది.

బోగస్ కాంట్రాక్టులు..రూ.3,300 కోట్ల నగదు

బోగస్ కాంట్రాక్టులు..రూ.3,300 కోట్ల నగదు

ఈ దాడుల్లో బోగస్‌ కాంట్రాక్టుల ద్వారా ఏకంగా రూ.3300 కోట్ల మేరకు నగదును పోగేయడం నుంచి పంపిణీ చేయడం వరకు..అన్ని అంశాలను మొత్తం ఆధారాలతో బయటికి లాగగలిగామని ఐటీ శాఖ తెలిపింది. తమ సోదాల్లో రూ.4.19 కోట్ల నగదు, 3.2 కోట్లకు పైగా విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. తమ సోదాల్లో రూ.4.19 కోట్ల నగదు, 3.2 కోట్లకు పైగా విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేసింది.

అయితే, ఆ ప్రముఖుడు రాజకీయంగా సంబంధాలు ఎవరితో నడిపారు..ఏదైనా పార్టీలో ఉన్న ప్రముఖుడా.. లేక వ్యాపార రంగంలో ఇతర రాష్ట్రాలతో సంబంధాలు కలిగిన వ్యక్తా..అనే చర్చ సాగుతోంది. అయితే, ఆదాయపు పన్ను శాఖ పరోక్షంగా ఇచ్చిన సంకేతాలతో ఆయన ఎవరనే దాని పైన పొలిటికల్ సర్కిల్స్ ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు.

English summary
Income Tax latest statement created many speculation in AP. IT says one official in AP took rs nearly rs 150 cr in Hawala route. got all the evidences. Now hot discussion on this statement in political and industrial circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X