వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిలోనూ పీకే, నంద్యాల గెలుపులో కీలకం, ఎవరతను?

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కాదు... తెలుగుదేశంలో కూడ ఓ పీకే ఉన్నారు.వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌కిషోర్‌ను ఇటీవలే నియమించుకొంది. అయితే తెలుగుదేశం కూడ పీకే ఉన్నారు. నంద్యాల ఉపఎన్నికల్లో పీకే కీలకంగా వ్యవహరించారని టిడిపివర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే వైసీపీ పీకే అనుసరించిన ఎన్నికల ఎత్తుగడ బెడిసికొట్టింది. కానీ, తెలుగుదేశం పార్టీ పీకే వ్యూహం సక్సెస్ అయింది. అయితే టిడిపిలో ఉన్న పీకే ఎవరనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

ఆ నిర్ణయమే శిల్పా సోదరుల కొంపముంచిందా, కలిసిరాలేదా, తొందరపాటా?ఆ నిర్ణయమే శిల్పా సోదరుల కొంపముంచిందా, కలిసిరాలేదా, తొందరపాటా?

2019 ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను వైసీపీ ప్రశాంత్‌కిషోర్‌ను వ్యూహకర్తగా నియమించుకొంది. నంద్యాల ఉపఎన్నికల్లో ప్రశాంత్‌కిషోర్ సూచనల మేరకే వైసీపీ చీఫ్ జగన్ 13 రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారని వైసీపీ వర్గాల కథనం.

ఆ మూలాలపై టిడిపి కన్ను, శిల్పా సోదరుల మధ్య విబేధాలు?ఆ మూలాలపై టిడిపి కన్ను, శిల్పా సోదరుల మధ్య విబేధాలు?

అయితే నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్త ఇచ్చిన సూచనలు ఆ పార్టీకి కలిసిరాలేదు. నంద్యాలతో పాటు కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో కూడ వైసీపీ ఘోర పరాజయం పాలైంది. అయితే ఈ తరుణంలో వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌పై స్వంతపార్టీకి చెందిన నేతలే విమర్శలు గుప్పించారు.

నంద్యాల: రిజల్ట్స్‌పై నిద్రపోలేదన్న అచ్చెన్న, దిమ్మతిరిగే జవాబిచ్చిన బాబునంద్యాల: రిజల్ట్స్‌పై నిద్రపోలేదన్న అచ్చెన్న, దిమ్మతిరిగే జవాబిచ్చిన బాబు


వైసీపీలోనే కాదు టిడిపిలోనూ పీకే ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల సమయంలో పార్టీ ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నుండి పార్టీ కీలక నేతలతో కలిసి పీకే పనిచేశారు.

టిడిపిలో పీకే ఎవరు?

టిడిపిలో పీకే ఎవరు?

తెలుగుదేశం పార్టీలో పీకే ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా టిడిపిలో ఉన్న పీకే వ్యూహలకు పదును పెడతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. శత్రు వ్యూహలను పసిగట్టి ఎదురుదాడిని సిద్దం చేస్తారు. శత్రువులను ముప్పుతిప్పలు పెడతారు. వైసీపీకి వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్‌కిషోర్ పార్ట్‌టైమ్ పొలిటిషీయన్‌గా వ్యవహరిస్తారు. కానీ, టిడిపిలో ఉన్న పీకే పూర్తిస్థాయి పొలిటీషీయన్. అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ను టిడిపి నేతలు ముద్దుగా పీకే అని పిలుచుకొంటారు.

నంద్యాల ఉపఎన్నికల్లో టిడిపిలో పీకే

నంద్యాల ఉపఎన్నికల్లో టిడిపిలో పీకే

నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడుపై వ్యక్తిగత విమర్శలకు పూనుకొన్నారు. ఈ విమర్శలకు పీకే సలహలే కారణమనే ప్రచారం ఆ పార్టీవర్గాల్లో ఉంది. నెగిటివ్‌గా అయినా, పాజిటివ్‌గా అయినా జనం దృష్టిని ఆకర్షించడమే ప్రధానమన్నది పీకే సలహా. ఆ సలహానే నంద్యాల ఎన్నికలలో జగన్‌కు ఇబ్బందికరంగా పరిణమించడమే కాకుండా తటస్థ ఓటర్లను తెలుగుదేశం వైపు మళ్లించిందని విశ్లేషణలు చెబుతున్నాయి.నంద్యాల ఉపఎన్నికలను పురస్కరించుకొని నంద్యాలలో, అమరావతిలో సమాచార కేంద్రాలను ఏర్పాటుచేసింది. సమాచార మార్పిడితో పాటు ఎప్పటికప్పుడు వ్యూహలను మార్చుకొనేందుకు ఈ సెంటర్లు దోహదపడ్డాయి. ఈ వ్యహరంలో పీకే (పయ్యావుల కేశవ్) కీలకంగా పనిచేశారు.

 శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్ చెల్లదనే వాదన తెచ్చింది పీకే

శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్ చెల్లదనే వాదన తెచ్చింది పీకే

నంద్యాల ఉపఎన్నికలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధి శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్ చెల్లదనే అంశం మొదలు అన్ని విషయాలను ఈ బ్యాక్ ఆఫీసే పర్యవేక్షించింది. కంట్రోల్ రూమ్‌లోని నేతలు "సీఎం నుంచి వచ్చిన ఆదేశాలను నంద్యాలలో పీకేకు చెప్పండి'' అంటూ పార్టీ సిబ్బందికి పురమాయించేవారు. ఆ సమయంలో శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్ చెల్లకపోతే పరిస్థితి ఏమిటనే వాదన కూడ ముందుకు వచ్చింది. అయితే ఈ వాదనను ముందుకు తెచ్చిన టిడిపి వైసీపీని కొద్దిసేపు ఆత్మరక్షణలో పడేసింది.

నంద్యాల సమాచారాన్ని బాబుకు వివరించే పీకే

నంద్యాల సమాచారాన్ని బాబుకు వివరించే పీకే

నంద్యాల ఉపఎన్నికలలో కంట్రోల్ రూమ్‌తో అనుసంధానంగా ఉంటూ, సీఎం చంద్రబాబు, చిన్న బాస్ లోకేశ్‌ నుంచి వచ్చే ఆదేశాలను అమలుచేస్తూ, క్షేత్రస్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులకు కావాల్సిన అవసరాలను చూసుకుంటూ కాగల కార్యాన్ని నెరవేర్చింది బ్యాక్ ఆఫీసే. ముఖ్యంగా ఈ పనిని సమర్థంగా చక్కబెట్టింది బ్యాక్ ఆఫీస్‌లో వెన్నెముక మాదిరిగా కేశవ్ వ్యవహరించారు.నంద్యాలలో చోటుచేసుకొంటున్న పరిణామాలపై బాబుకు పీకే సమాచారాన్ని చేరవేసేవారు.

నంద్యాల ఫలితాల వెనుక వీరే

నంద్యాల ఫలితాల వెనుక వీరే


నంద్యాల ఉపఎన్నికల ఫలితాల రోజు కంట్రోల్ రూమ్‌లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దే నేతలంతా కూర్చున్నారు. అంతకముందు రోజు బూత్‌ల వారీగా పోలైన ఓట్లు ఎవరికి ఎన్ని వస్తాయని ఒక అంచనా కూడా వేశారు. ఈ కంట్రోల్ రూమ్‌ నుంచే మంత్రి అచ్చెన్నాయుడు, మరో మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ళ నరేంద్రకుమార్, గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ రెండు నెలల నుంచి నంద్యాల ఉపఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. సీఎం నుంచి వచ్చిన ఆదేశాలను నంద్యాలలో ఉండే పార్టీ శ్రేణులకు, క్షేత్రస్థాయిలోని సమాచారాన్ని సీఎంకు అందిస్తూ వచ్చారు. అదే సమయంలో పార్టీ పరమైన ఆదేశాలను కూడా కిందిస్థాయికి చేరవేసేవారు. ఆ ఆదేశాలను అమలు చేసేందుకు, క్షేత్రస్థాయిలో అవసరమైన సలహాలు, సూచనలను ఇచ్చేందుకు, అందరినీ సమన్వయం చేసేందుకు నంద్యాలలో తెలుగుదేశం పార్టీ ఒక బ్యాక్‌ ఆఫీస్‌ను ఏర్పాటుచేసింది. అందులో పయ్యావుల కేశవ్ (పీకే)ను నియమించింది.

English summary
Pk keyrole for tdp in Nandyal result . Pk alias Payyavula Keshav worked as backoffice incharge in Nandyal bypoll.Pk coordinated to Amravati control room from Nandyal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X