వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖైదీ నెం.150 ఫంక్షన్ త్వరగా ముగించాలని చెప్పారా?, స్వల్ప తొక్కిసలాట

ఖైదీ నెంబర్ 150 సినిమా ఫ్రీలాంచ్ వేడుక శనివారం రాత్రి గుంటూరు సమీపంలోని హాయ్‌ల్యాండ్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఖైదీ నెంబర్ 150 సినిమా ఫ్రీలాంచ్ వేడుక శనివారం రాత్రి గుంటూరు సమీపంలోని హాయ్‌ల్యాండ్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సినిమా ఫ్రీలాంచ్ వేడుకను త్వరగా ముగించాలని స్థానిక పోలీసు అధికారి చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది.

ఖైదీ నెంబర్ 150 చిత్ర ఫ్రీలాంచ్ వేడుకను వీలైనంత త్వరగా ముగించాలని గుంటూరు రేంజ్ ఐజీ సినిమాకు సంబంధించిన వర్గాలను ఆదేశించారని తెలుస్తోందని అంటున్నారు.

హాయ్‌ల్యాండులో ఇప్పటికే పరిమితికి మించి జనం చేరుకున్నారని, తిరిగి వెళ్లే సమయంలో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉన్నందున వెంటనే ఫంక్షన్ ముగించాలని ఐజీ ఆదేశించారని తెలుస్తోందట. ఈ విషయమై అల్లు అరవిందుతో చర్చించారట కూడా.

'రాజకీయ కక్ష, చిరుకు అవమానం': 150వ సినిమాకు బాబు అనుమతివ్వడం లేదా?'రాజకీయ కక్ష, చిరుకు అవమానం': 150వ సినిమాకు బాబు అనుమతివ్వడం లేదా?

తొక్కిసలాట

ఖైదీ నెంబర్ 150 ఫ్రీ లాంచ్ వేడుకలో ఏర్పాటు చేసిన బారికేడ్లు విరిగిపోవడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. మరోవైపు అభిమానులను నియంత్రించడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు. దాదాపు పదిహేడు మంది అభిమానులు గాయపడ్డారని తెలుస్తోంది.

ఈ ఘటనలో చెంచయ్య అనే కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు బౌన్సర్లకు గాయాలు అయ్యాయి. ఓ అభిమానికి ఇనుపచువ్వు గుచ్చుకుంది. బౌన్సర్లకు, అభిమానులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఖైదీ నెంబర్ 150

ఖైదీ నెంబర్ 150

కాగా, చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 ఫ్రీలాంచ్ వేడుక గుంటూరు జిల్లాలోని హాయ్ ల్యాండ్సులో అంగరంగ వైభవంగా జరిగింది.

పవన్ కళ్యాణ్ రాకపోవడం చర్చ

పవన్ కళ్యాణ్ రాకపోవడం చర్చ

చిరంజీవి హీరోగా వివి వినాయక్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ఖైదీ నంబర్‌ 150. కాజల్‌ కథానాయిక. రామ్ చరణ్‌ తేజ నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ రాకపోవడం చర్చకు దారి తీసింది. అయితే ఆయన ట్వీట్టర్ ద్వారా తన స్పందన తెలిపారు.

ఉత్సాహం

ఉత్సాహం

ఈలలు.. చప్పట్లు విని చాలా సంవత్సరాలు అయిందని, వీటికి ఎంత శక్తి ఉన్నది అనుభవపూర్వకంగా తెలిసిన వాడినని, మీ నుంచి మరింత ఉత్సాహం కావాలని, దాని కోసం చాలా సంవత్సరాలు ఎదురు చూసి ఇప్పుడు మీ ముందుకు వచ్చానని చిరంజీవి అన్నారు.

చిరంజీవి

చిరంజీవి

ఇక్కడ ఉన్న అభిమానులను చూస్తుంటే విజయవాడ కృష్ణానది పక్కన ఉన్నానా? విశాఖ సముద్రతీరం పక్కన ఉన్నానా అనిపిస్తోందన్నారు. ఈ సినిమాలో ఖైదీ డ్రస్‌తో ఉన్న నా ఫస్ట్‌లుక్‌ వచ్చినప్పుడు జేబుపై ఉన్న 150 నంబర్‌ చూసి దాసరి తనకు ఫోన్‌ చేశారని, సినిమాకు ఖైదీ నంబర్‌ 150 పెట్టుకోవాలని సూచించారని చెప్పారు.

English summary
A minor stampede broke out when the fans vied with each other to catch glimpse of the actor-politician. seventeen people were injured in the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X