వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజా తొలి ఆటోగ్రాఫ్.. రోడ్డుపైకి కియా కారు..! ఆవిష్కరించిన మంత్రులు

|
Google Oneindia TeluguNews

అనంతపురం: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ప్రతిష్ఠాత్మక కియా తొలి కారు రోడ్డెక్కింది. వెలుగులు విరజిమ్ముతూ కియా సెల్టోస్ ఎస్ యూవీ మోడల్ కారు జిల్లాలోని పెనుకొండలో నెలకొల్పిన ప్లాంట్ లో కనువిందు చేసింది. నారింజ, తెలుపు మిశ్రమంతో కూడిన సెల్టోస్ కారును రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శంకర నారాయణ, హిందూపురం లోక్ సభ సభ్యుడు గోరంట్ల మాధవ్, విప్ కాపు రామచంద్రా రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కారుపై రోజా తొలి సంతకం చేశారు.

<strong>వీడియో: వరద బాధితుల ఆర్థిక సహాయంలో వైఎస్ జగన్ మానవీయం: రెట్టింపు పరిహారం చెల్లింపు!</strong>వీడియో: వరద బాధితుల ఆర్థిక సహాయంలో వైఎస్ జగన్ మానవీయం: రెట్టింపు పరిహారం చెల్లింపు!

వెస్ట్ విషెష్ అంటూ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. దక్షిణ కొరియాకు చెందిన రెండో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ యాజమాన్యం ఈ కారును రూపొందించింది. త్వరలోనే సెల్టోస్ కారు దేశంలోని అన్ని షోరూమ్ లల్లో అందుబాటులోకి రానున్నాయి.నిజానికి- ఈ తొలికారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించాల్సి ఉంది. ఢిల్లీ పర్యటనలో వైఎస్ జగన్ తీరిక లేకుండా ఉండటం వల్ల రాలేకపోయారని మొదట్లో వార్తలు వచ్చాయి.

 kia seltos car launched by ministers of Andhra Pradesh at Penukonda plant in Ananthapur District

అవి నిజం కాదని తేలిపోయింది. వైఎస్ జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాల్సి ఉన్నందున ఈ కార్యక్రమానికి గైర్హాజరు అయ్యారు. తనకు బదులుగా మంత్రులను ఈ కార్యక్రమానికి పంపించారు. కారును ఆవిష్కరించడం కంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించడం, బాధితులకు తక్షణ సహాయాన్ని అందజేయడంపైనే వైఎస్ జగన్ దృష్టి పెట్టారని, అందువల్లే కారు ఆవిష్కరణకు రాలేదని మంత్రులు తెలిపారు.

 kia seltos car launched by ministers of Andhra Pradesh at Penukonda plant in Ananthapur District
English summary
South Korea's top automobile company KIA Motors India launched his first Car in India. KIA Seltos Car released on Thursday by the Ministers of Andhra Pradesh Buggana Rajendranath Reddy, Shankara Narayana, Member of Parliament Gorantla Madhav, Whip K Rama Chandra Reddy, APIIC Chairperson RK Roja at Penukonda plant in Ananthapur District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X