నోట్ల రద్దుతో పడరాని పాట్లు: కిల్లి కృపారాణి
శ్రీకాకుళం: పాతనోట్లన్ని నల్లధనంగా.. కొత్త నోట్లన్నీ తెల్లదనంగా ప్రధాని నరేంద్ర మోడీ నిర్వచించడం దేశ ప్రజల దౌర్భాగ్యమని కేంద్ర మాజీ మంత్రి డా. కిల్లి కృపారాణి మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆమె ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నోట్ల రద్దుతో దేశంలోని వ్యవసాయ,అసంఘటిత,పారిశ్రామిక రంగాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. సామాన్య మధ్య తరగతి ప్రజలతో పాటు బడుగు బలహీన వర్గాలు వారు పడరాని పాట్లు పడుతున్నారని దుయ్యపట్టారు.












Click it and Unblock the Notifications