కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీ వైపు కిల్లి కృపారాణి: ఆ ఎమ్మెల్యేలు ఎటు?

By Pratap
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం/ కర్నూలు: శ్రీకాకుళం కాంగ్రెసు పార్లమెంటు సభ్యురాలు, కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆమె గత కొద్ది కాలంగా ఎవరికీ కనిపించడం లేదని, పార్టీ మారే ఉద్దేశంతోనే ఆమె ఎవరికీ అందుబాటులోకి రావడం లేదని అంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెసు పరిస్థితి దిగజారడంతో ఆమె పార్టీ మారాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

కిల్లి కృపారాణి భర్త డాక్టర్ రామ్మోహన్ రావు కూడా ఎవరికీ అందుబాటులోకి రావడంలేదని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి కిల్లి కృపారాణి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థులను రంగంలోకి దించలేదని అంటున్నారు. పార్టీ మారే ఉద్దేశంతోనే అలా చేసి ఉంటారనే ప్రచారం సాగుతోంది. పార్టీ మారి టెక్కలి శాసనసభా స్థానం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో కిల్లి కృపారాణి ఉన్నట్లు చెబుతున్నారు. ఆమె బిజెపి వైపు చూస్తున్నట్లుగా కూడా కొంత మంది చెబుతున్నారు.

Killi Kruparani may join in YSRCP

ఇదిలావుంటే, కర్నూలు జిల్లాలోని ముగ్గురు కాంగ్రెసు శానససభ్యులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు.
ముగ్గురు కర్నూలు కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఏ పార్టీలోకి వెళ్లాలనే విషయంపై అయోమయంలో పడినట్లు చెబుతున్నారు. పాణ్యం శానససభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డికి కాంగ్రెసు టికెట్ లభించే అవకాశం లేదని అంటున్నారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని అనుకున్నారు. అయితే టిడిపి నుంచి ఆయన పాణ్యం టికెట్ ఇస్తామనే హామీ లభించకపోవడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.కాగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆలోచనలో కూడా ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. జై సమైక్యాంద్ర పార్టీ ఉనికి లేకపోవడంతో ఆ పార్టీలో చేరేందుకు ఆయన సుముఖంగా లేరని అంటున్నారు.

కాగా, కోడుమూరు కాంగ్రెసు శాసనసభ్యుడు మురళీకృష్ణ కూడా కాంగ్రెసు పార్టీకి దూరమవుతున్నట్లు చెబుతున్నారు. ఆయన రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి సన్నిహితుడు. అయినా, ఆయన కోట్లను కూడా కలుసుకోవడం లేదని చెబుతున్నారు. ఆయన ఎటు పోపాలనే విషయంలో అయోమయంలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఆలూరు కాంగ్రెసు శాసనసభ్యురాలు నీరజారెడ్డి పరిస్థితి కూడా గందరగోళంలోనే ఉన్నట్లు చెబుతున్నారు. ఆమె జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. అయితే, ఆ పార్టీకి ఊపు రాకపోవడంతో టిడిపిలో చేరడానికి ప్రయత్నాలు చేసినట్లు చెబుతున్నారు. అయితే, అక్కడ ఆమెకు ఆలూరు టికెట్ లభించే అవకాశం లేదని అంటున్నారు. ఈ ముగ్గురు శాసనసభ్యులు కూడా బిజెపిలో చేరడానికి బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడితో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే, తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటే బిజెపి టికెట్ దక్కడం అనుమానమే. దీంతో ఏం చేయాలనే విషంయంపై వారు సందిగ్ధంలో పడినట్లు చెబుతున్నారు.

English summary
Union minister Killi Kruparani is seeing towards YS Jagan's YSR Congress. In May 2009, Dr. Killi Kruparani was elected to the 15th Lok Sabha from Srikakulam Constituency in Andhra Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X