వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిగ్ మిస్టేక్: ఫేస్‌బుక్‌లో బుక్కైన అచ్చెన్నాయుడు!(పిక్చర్స్)

ఆంధ్రప్రదేశ్ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫేస్‌బుక్‌లో పెద్ద పొరపాటు చేశారు. అచ్చెన్నాయుడి సోదరుడు దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు కుమారుడు,

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫేస్‌బుక్‌లో పెద్ద పొరపాటు చేశారు. అచ్చెన్నాయుడి సోదరుడు దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడుకు ఇటీవలే వివాహమైన విషయం తెలిసిందే.

పోస్టు ఇలా..

పోస్టు ఇలా..

కాగా, జులై 19న ఢిల్లీలో రామ్మోహన్నాయుడు వివాహ రిసెప్షన్ వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆ వేడుకకు ఎవరెవరు వచ్చారో తెలుపుతూ అచ్చెన్నాయుడు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఫొటోలను పోస్టు చేశారు.

మిస్టేక్ పెద్దదే..

మిస్టేక్ పెద్దదే..

‘ప్రధాని నరేంద్ర మోడీతోపాటు లోకసభ స్పీకర్ గౌరవనీయులు శ్రీమతి షీలా దీక్షిత్ గారు, ఇతర కేంద్రమంత్రులు హాజరయ్యారు' అని ఆ ఫొటోకు వ్యాఖ్యానం రాశారు. అయితే, ప్రస్తుత లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కాగా, ఆయన మాత్రం ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ అని రాయడం విమర్శలకు తావిచ్చింది.

విమర్శలు..

విమర్శలు..

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు అచ్చెన్నాయుడిపై సెటైర్లు వేస్తున్నారు. లోకసభ స్పీకర్ కూడా తెలియకుండా మంత్రి ఎలా అయ్యారంటూ మండిపడుతున్నారు.

అచ్చెన్నాయుడిదేనా..?

అచ్చెన్నాయుడిదేనా..?

అయితే, ఆ ఫేస్‌బుక్ ఖాతా మంత్రి అచ్చెన్నాయుడిదేనా? లేక వేరే ఎవరైనా ఆయన పేరు మీద కొనసాగిస్తున్నారా? అనేది తేలాల్సి ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నోబెల్ అని, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీకాంలో ఫిజిక్స్ అని విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

English summary
Andhra Pradesh minister Atchannaidu did a mistake in his facebook account mentioning lok sabha speaker is sheila dikshit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X